Take a fresh look at your lifestyle.

యూనివర్సిటీలో భారమైన ఇంజనీరింగ్‌ ‌విద్య

విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సంపాదించుకుని యూనివర్సిటీలలో చేరితే ఇవ్వాళ సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌లో ఉన్న ఫీజులు ఎలా కడతారు. యూనివర్సిటీ పరిధిలో కన్వీనర్‌ ‌కోటాలో ఉన్న 3645 సీట్లు ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌ల ఫీజులు 35000/- నుంచి 1,20,000/- వరకు పెంచుకున్నారు. ఈ ఫీజులు విద్యార్థుల పైన పెను భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఫీజులు ఈ విధంగా పెంచితే ఎవరి మీద భారం పడుతుంది,అది కట్టడం ఎలా సాధ్యం అవుతుంది.గతంలో ప్రభుత్వాలే ఫీజుల చెల్లింపు పైన,పెంచవద్దని జీవోలు జారీ చేసారు. ఇవాళ ఇలా పెంచడం దేనికి సంకేతం.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది 172 ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు అనుమతులు పొందాయి.అందులో 157 ప్రైవేట్‌ ఇం‌జనీరింగ్‌ ‌కళాశాల కాగా, మిగతా 15 కాలేజీలు ప్రభుత్వ వివిధ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్‌ ‌విద్యను అందిస్తున్నా యూనివర్సిటీలో జెఎన్టియుహెచ్‌ , ఉస్మానియ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్‌ ‌విద్య ఒక్కటే అయిన, రెండు రకాల కోర్సులు పేరుతో ఫీజుల మోత మోగిస్తూనాయి.అవి 1. రెగ్యులర్‌ ‌కోర్స్ అని 2. సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ • ఇం‌టిగ్రేటెడ్‌ ‌కోర్స్ అని పెట్టీ, బ్రాంచులు, బోధన విధానం, సబ్జెక్టులు అన్నీ సమానంగా ఉన్న వివిధ కోర్సుల పేరుతో ఫీజులు పెంచడంతో పేద, మధ్య తరగతి ఉత్తమ విద్యార్థుల పైన పెనుభారం పడింది.

విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సంపాదించుకుని యూనివర్సిటీలలో చేరితే ఇవ్వాళ సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌లో ఉన్న ఫీజులు ఎలా కడతారు. యూనివర్సిటీ పరిధిలో కన్వీనర్‌ ‌కోటాలో ఉన్న 3645 సీట్లు ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌ల ఫీజులు 35000/- నుంచి 1,20,000/- వరకు పెంచుకున్నారు. ఈ ఫీజులు విద్యార్థుల పైన పెను భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఫీజులు ఈ విధంగా పెంచితే ఎవరి మీద భారం పడుతుంది,అది కట్టడం ఎలా సాధ్యం అవుతుంది.గతంలో ప్రభుత్వాలే ఫీజుల చెల్లింపు పైన,పెంచవద్దని జీవోలు జారీ చేసారు. ఇవాళ ఇలా పెంచడం దేనికి సంకేతం.

వాస్తవానికి రాష్ట్రంలో తెలంగాణ అడ్మిషన్స్ ‌ఫీజు రెగ్యులరీటీ కమిటీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఫీజులను నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే 2019-2022 వరకు ప్రభుత్వ యూనివర్సిటీలలో గతంలో ఉన్న 10 వేల రూపాయల ఫీజును 18 వేలకు పెంచింది. ఈ పెంచిన ఫీజులు మూడు సంవత్సరాలు వరకు ఉంటుంది.కానీ మూడు సంవత్సరాలు కాకముందే యూనివర్సిటీలో ఒకేసారి 18 వేల నుంచి 35,50,70 వేలకు మరియు 1లక్ష ,1.20 లక్షలు ఎట్ల పెంచుతున్నారు. కాంట్రాక్ట్,ఇతర ఉద్యోగులకు జీతాలు పెరిగాయి, అందుకే ఫీజుల పెంచుకోవచ్చని జూలై నెలలో జరిగిన సమావేశాలలో సలహా ఇచ్చారు, బాగానే ఉంది,అసలు ఉన్నత విద్య బడ్జెట్‌ ఎక్కడ ? యూనివర్సిటీల బడ్జెట్‌ ఎక్కడ ? వాటి ద్వారా విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించే విధంగా చూడాలి కాద, విద్యార్థుల మీద సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌ల పేరుతో ఫీజుల భారం కాకుండా చూడాలి.

 యూనివర్సిటీలో ఈ వ్యత్యాసం ఎందుకు ?
రాష్ట్రంలోని 4 యూనివర్సిటీలు ఇంజనీరింగ్‌ ‌విద్యను అందిస్తున్నాయి.కానీ ఫీజుల చెల్లింపు విషయములో ఈ వ్యత్యాసం ఏమిటి ? ఒక్క సారి చూస్తే , 1965 లో ఏర్పడిన జెఎన్టియూ పరిధిలో జెఎన్టియూహెచ్‌ 7 ‌బ్రాంచులో,ఒక్కొక బ్రాంచీలో 60 సీట్ల చొప్పున 420 సీట్లు ఉన్నాయి.వారికి సంవత్సరానికి ఫీజు 35000/- ఉంటే, అదే జెఎన్టియూహెచ్‌ ‌లో 5స.ల ఇంటిగ్రేటేడ్‌ ‌సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌పేరుతో 6 బ్రాంచీలు ఒక్కొక బ్రాంచీలో 30 మంది విద్యార్థులు అంటే 180 మంది విద్యార్థులు,వారికి సంవత్సరానికి 70,000/- పెంచారు. జెఎన్‌ఏఎఫ్‌ఏయూ లో 3 బ్రాంచిలకి 160 సీట్లకు గాను ఒక్కొక విద్యార్థి సంవత్సరానికి ఫీజు 50,000/- కి పెంచారు. జెఎన్టియూ జగిత్యాల లో 5 బ్రాంచీలు 300 మంది విద్యార్థులు,సంవత్సరానికి 35000/- , జెఎన్టియూ మంథని లో 6 బ్రాంచీలో 335 మంది విద్యార్థులు,వారికి సంవత్సరానికి 35000/-., జెఎన్టియు సుల్తాన్‌ ‌పూర్‌ ‌లో రెగ్యులర్‌ ‌గా 4 బ్రాంచీలో 240 మంది విద్యార్థులు వారికి సంవత్సరానికి 35000/- కి పెంచారు. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన జెఎన్టియూ సిరిసిల్లలో 6 బ్రాంచీలో 320 సీట్లు ఉంటే,సంవత్సరానికి ఫీజు 35000/- చేసారు. అలాగే 1976 లో ఏర్పాటుచేసిన కాకతీయ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ ‌కొత్తగూడెంలో మూడు బ్రాంచీల్లో( సిఎస్‌ఈ, ఈఈఈ, ‌మైనింగ్‌) ‌రెగ్యులర్‌ ‌కోర్స్ ‌లో 85 మంది విద్యార్థులు ఉంటే,వారికి సంవత్సరానికి 18 వేల రూపాయల ఫీజు, అదే కాలేజిలో సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్సులో రెండు బ్రాంచీలు(ఈసిఈ, ఐటి) 120 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సంవత్సరానికి 35 వేల రూపాయలు ఉంది.

ఇక్కడ చూస్తే రెగ్యులర్‌ ‌కోర్స్ ‌లో ఈసిఈ, ఐటి లేక పోవడం బాధాకరం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జినీరింగ్‌ అం‌డ్‌ ‌టెక్నోలజీ ఫర్‌ ఉమెన్‌ ‌లో సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌లో 4 బ్రాంచ్‌ ‌లో 240 మంది విద్యార్థులు సంవత్సరనికి 35000/- ఫీజు పెంచారు.యూనివర్సిటీలోని మహిళా కళాశాలను సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌కి పెట్టడం ఏమిటి ? అంత ఫీజు ఎలా కడుతారు,ప్రభుత్వమే వారికి చెల్లించే బాధ్యత తీసుకోవాలి.లేదంటే ఆ కోర్సును రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద కి మార్చి విద్యార్థుల పై ఫీజు భారం తగ్గించాలి. కాకతీయ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ అం‌డ్‌ ‌టెక్నాలజీ లో రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద నాలుగు బ్రాంచీలో 60 మంది విద్యార్థులకుగాను సంవత్సరానికి ఒక్కొక విద్యార్థికి 18 వేల రూపాయల ఫీజు ఉంటే, అదే కాలేజీలో సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌కింద 2 బ్రాంచ్లో 120 మంది విద్యార్థులు సంవత్సరానికి 35వేల ఫీజు కడుతున్నారు. ఇక్కడ కూడా రెగ్యులర్‌ ‌కోర్స్ ‌లో సివిల్‌ , ఐటీ లేకపోవడం, ఆ బ్రాంచులాను సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌కింద ఫీజు 35000/- కి పెట్టడం ఏమిటి ? కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద ఈసిఈ, ఐటి లేక పోవడం ఏమిటి ? యూనివర్సి•టిలో ఈ తేడా ఎందుకు ? పేద మధ్య తరగతి విద్యార్థులుకి ఆ కోర్సులో సీట్లు వచ్చే అవకాశం కోల్పోతున్నారు.

1925 లో ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ ‌లో రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద 6 బ్రాంచ్లో 320 సీట్లకుగాను సంవత్సరానికి 35 వేల ఫీజు ఉంటే , సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌కింద రెండు బ్రాంచీలు 120 మంది విద్యార్థులు ఉన్నారు ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ అం‌డ్‌ ‌మెషీన్‌ ‌లెర్నింగ్‌ ‌కి 1,20,000/- మరియు మైనింగ్‌ ‌కి 1,00000/- కి పెంచారు.సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌లో ఈ విధంగా లక్షల రూపాయల ఫీజులు పెంచడంతో పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి ? వారు ఆ కోర్సులకు దూరం అయ్యే అవకాశం ఉంది,కావున ప్రభుత్వమే అట్టి ఫీజును చెల్లించాలి. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ హైదరాబాద్‌ ‌లో రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద 3 బ్రాంచులో(60ం30ం30) 120 మంది విద్యార్థులకు, ఒక్కొక విద్యార్థి సంవత్సరానికి 35000/- ఉంటే, సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్లో 2 బ్రాంచ్‌ ‌లో 60 (30ం30) మంది విద్యార్థులు ఉంటే, ఒక్కొక విద్యార్థికి సంవత్సరానికి 70 వేల రూపాయలకి పెంచారు. ఇక్కడ చూస్తే రెగ్యులర్‌ ‌కోర్స్ ‌లో 2 బ్రాంచ్లో( ఫుడ్‌ ‌టెక్నాలజీ, టెక్స్టైల్‌ ‌టెక్నాలజీ) 30 చొప్పున 60 సీట్లు,అదే బ్రాంచ్లో సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌కోర్స్ ‌కింద 30 చొప్పున 60 సీట్లు పెట్టీ అధిక ఫీజులు వసూలు పెట్టడం ఏమిటి ? దాని పైన ప్రభుత్వం ఆలోచించి సెల్ఫ్ ‌ఫైనాన్స్ ‌తొలగించి,రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద కి తీసుకొని రావాలి.

అదే విధంగా నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో కూడా రెగ్యులర్‌ ‌కోర్స్ ‌కింద 3 బ్రాంచ్లో 180 మంది విద్యార్థులకు గాను సంవత్సరానికి ఒక్కోకరికి 35 వేల రూపాయలు ఉంది. ఇక్కడ మొత్తంగా చూస్తే యూనివర్సిటీలో ఇంత ఫీజులు పెంచడం ఏమిటి ? ఒకే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో ఇంతా ఫీజుల వ్యత్యాసం ఏమిటి ? ఈ విషయం పై ఉన్నత విద్య శాఖ, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ‌కమీషనర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి పేద ,మధ్యతరగతి ఉత్తమ విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఫీజుల పెంపు విరమించుకోవాలని,పాత ఫీజులను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
అయినేని.సంతోష్‌ ‌కుమార్‌
‌రాష్ట్ర అధ్యక్షులు  TSTCEA  :961892773

 

Leave a Reply