ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు భారీగా మిర్చి తరలివచ్చింది. సోమవారం ఆయా జిల్లాల నుంచి అన్నదాతలు 50 వేల మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో మరుసటి రోజు సోమవారం మార్కెట్ ప్రధాన యార్డు ఎర్ర బంగారంతో మెరిసిపోయింది. ఈ సీజన్‌లో ఇంతపెద్ద మొత్తంలో పంట రావడం ఇదే మొదటిసారి. తెల్లవారుజాము వరకు 25 వేల బస్తాలు వచ్చాయి. ఉదయం 8 గంటల వరకు మరో 25 వేల బస్తాలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, సెక్రటరీ ఆర్.మల్లేశంతో కలిసి జెండాపాటకు తగు చర్యలు చేపట్టారు.
ఉదయం జరిగిన జెండాపాటలో పంటకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.13,700 పలికింది. మార్కెట్ యార్డు లోపల మాత్రమే పంట దిగుమతి కావాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చైర్మన్ తన చాంబర్‌లో కవి•షన్ వ్యాపారులు, గుమస్తాల సంఘం బాధ్యులతో సమావేశమయ్యారు. రైతులు తీసుకొచ్చిన పంటను ఆయా ప్రదేశాల్లో ఏ ఆటంకం కలుగకుండా కవి•షన్ వ్యాపారులు చొరవ తీసు కోవాలని సూచించారు. సకాలంలో కాంటాలు కావడం, తోలకాల పక్రియ ముగియడం వంటి చర్యలతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ఊపిరిపీల్చుకున్నారు.