Take a fresh look at your lifestyle.

చిరు ధాన్యాల  సతీష్ కు నివాళి

వ్యవసాయం ఒక జీవన విధానం గానే కాకుండా ఒక రంగుల పండుగ గా రంగురంగుల బండ్లలో వాళ్ల ఉత్పత్తులు,వాటితో వాళ్ళు వండే వంటలు,తయారు చేసే చిరు ఆహారాలతో  ఒక జాతరతీసి,ప్రతి ఫిబ్రవరి మాసం లో ఊర్లన్ని తిరిగి ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఇంకా ఈ సంఘాలు చేసిన చేస్తున్న పనులు చాలా ఉన్నాయి.ఈ పనులకు ఈ సంస్థ అందుకున్న అంతర్జాతీయ అవార్డ్ లే తార్కాణం.
దేశం లో చిరు ధాన్యాల మనిషి గా పేరుతెచ్చుకున్న,*దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ* వ్యవస్థాపకుడు, పి. వి.సతీష్ ఆదివారం ఉదయం మరణించాడని తెలిసి విచారం కలిగింది.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మెదక్ జిల్లా,జహీరాబాద్ మండలం లో దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ కొందరు ఆలోచనా పరుల  ప్రోద్భలంతో ప్రారంభం అయింది. సంస్థ వ్యవస్థాపకుల్లో ప్రముఖంగా సతీష్ కృషి వల్ల వెనుక బడ్డ ప్రాంతం లో ఉన్న జహీరాబాద్ గ్రామాలు ప్రపంచ వ్యవసాయ రంగ నిపుణుల దృష్టిని ఆకర్షించాయి.75 గ్రామాల్లో ఏర్పరచిన సంఘాలు,ముఖ్యంగా దళిత,పేద బలహీన వర్గాలకు చెందిన వ్యవసాయమే జీవనం గా కొనసాగిస్తున్న మహిళా సభ్యులు అద్భుతాలు సృష్టించారు.
మహిళా సాధికారత,సహకార సంఘాల వ్యవస్థ అవసరం గురించి ,ప్రభుత్వ అధికారులు, కొందరు సామాజిక చింతనా పరులు  ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తాం.
కానీ సతీష్ గారి ఆలోచన,నిబద్దత వాళ్ల జీవితాలు మార్చుకోవాలి అని అనుకున్న  మహిళల సంకల్పం వల్ల సాధికారత ,సహకారం,వాటి ఫలితం ఎట్లా ఉంటుందో ప్రత్యక్షం గా చూపెట్టారు.
కరువు పీడిత,వెనుక బడ్డ,నిస్సారమైన ఆ గ్రామాలలోని భూములతో ఎట్లా మైత్రి చేసి, జీవనోపాధి కూడగట్టుకోవచ్చు అని ఈ సంఘాల సభ్యులు చూపెట్టారు.
డీ.డీ.ఎస్ సంస్థ వ్యవసాయ రంగం లో విన్నూత్న ప్రయోగాలు చేసింది.
సాంప్రదాయకంగా ఎక్కువ నీరు అవసరం ఉండే పంటల నుండి వర్షాధారం తో ఎరువులు లేకుండా తక్కువ పెట్టుబడితో పండే తృణ ధాన్యాల వైపు దృష్టి పెట్టి విజయం సాధించింది.ఈ మధ్యకాలం లో ఆరోగ్యానికి తృణ ధాన్యాల ఆవశ్యకత గురించి,వాటిలో ఉండే పోషకా ల గురించి పుంఖాను పుంకాలు గా వ్యాసాలు రాస్తున్నారు…ఉపన్యాసాలు ఇస్తున్నారు.కానీ జహీరాబాద్ ప్రాంతం లోని గ్రామాల లోనీ సంఘాలు మూడు దశాబ్దాల క్రితమే ఈ విషయాలు ఆచరణలో చూపెట్టారు.ఆ ప్రాంతం లోని *అర్జున్ నాయక్ తండా* చిరు ధాన్యాల కు చిరునామా అయింది.
ఆక్కడ రైతు ల విత్తనాల బ్యాంకు,జీన్ బ్యాంక్,సహకార రుణాల బ్యాంక్,బాల వాడీలు, వాళ్ళే ఏర్పరచుకున్న మార్కెట్ వ్యవస్థ,పశు సంపద వ్యవస్త సతీష్ గారి దృఢమైన నిబద్దత,మహిళల సంకల్పానికి చిహ్నాలుగా మనకు కనపడతాయి.
ప్రజల అనుభవం లో ఉన్న సంప్రదాయక విజ్ఞానాన్ని వ్యవసాయ రంగం లో,అరోగ్య రక్షణలో, ఆధునిక విజ్ఞానం తో జతపరచి అక్కడ చూపెట్టారు.
పనికి రావని తీసి వేసే కలుపు మొక్కల్లో ఉండే పౌష్టిక విలువలను గుర్తించి వాటితో కూరలు వండి
తినిపించారు ఈ మహిళా సంఘం సభ్యులు.పర్యావరణం,భూసారాన్ని రక్షించుకోవడం,రసాయన ఎరువులను దూరంగా పెట్టడం లో మెళకువలు నేర్చుకున్నారు.
ఆధునిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయం గా ప్రకృతి తో మమేకం అయే  ఫార్మా కల్చర్ పద్దతిని అమలు పరచి చూపెట్టారు.
వ్యవసాయం ఒక జీవన విధానం గానే కాకుండా ఒక రంగుల పండుగ గా రంగురంగుల బండ్లలో వాళ్ల ఉత్పత్తులు,వాటితో వాళ్ళు వండే వంటలు,తయారు చేసే చిరు ఆహారాలతో  ఒక జాతరతీసి,ప్రతి ఫిబ్రవరి మాసం లో ఊర్లన్ని తిరిగి ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఇంకా ఈ సంఘాలు చేసిన చేస్తున్న పనులు చాలా ఉన్నాయి.ఈ పనులకు ఈ సంస్థ అందుకున్న అంతర్జాతీయ అవార్డ్ లే తార్కాణం.
అయితే ఆ ప్రాంతం లో ప్రభుత్వం తలపెట్టిన జాతీయ పరిశ్రమల కేంద్రం ఇంత బాగా అర్థవంతం గా అభివృద్ధి చేసుకున్న గ్రామాలను విధ్వంసం చేయ బోతుందన్న నిజం బాధ పెడుతుంది.సతీష్ గారు కూడా ఈ జరుగబోయే విధ్వంసం గురించి ఆందోళన ప్రభావితం గా చేపట్టలేక పోయారన్న  అసంతృప్తి మా లాంటి వాళ్లకు ఉంది. సతీష్ గారు చేసిన ఈ కృషి  ఫలితాలను  నిలుపుకోవడం మాత్రమే కాక ఆ వ్యవస్థలను ఇంకా పటిష్టం చేయవల్సి ఉంది.
మిత్రుడు పి.వి.సతీష్ కు సలాం..!
S.జీవన్ కుమార్
మానవ హక్కుల కార్యకర్త

 

రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంతాపం

  • దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ పి.వి సతీష్ (77) మరణం పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సతీష్ గారి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు .
    అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించిన సతీష్ గారు జహీరాబాద్ ప్రాంతంలో నలభై సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ మిలెట్స్ సేంద్రియ వ్యవసాయంలో రైతులకు.. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మహిళలకు శిక్షణ ఇచ్చి మహిళ సాధికారతకు కృషిచేసిన గొప్ప మానవతవాది అని మంత్రి హరీష్ రావు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

 

Leave a Reply