Take a fresh look at your lifestyle.

గుండెపగిలిన చప్పుడు!

నాలుగు పక్కపక్కనే సర్దిండ్లు
వాటి పై మరిన్ని పేర్చిండ్లు
ఆరడుగుల కట్టెల నులుక
అదే చివరాఖరికి పడక
చితి మంటల్లో దహనం
ప్యాక్‌ ‌చేసిన మృతదేహం
వొకరో ఇద్దరో దూరంగా
తమకు తామే భారంగా
గొంతు పెగలని ఏడుపు
గుండె పగిలిన చప్పుడు

ఎప్పుడు ఎత్తెనో జన్మ!!!
చూడు ఇట్లాయే కదా ఖర్మ!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply