ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు తన తాజా బడ్జెట్లో 11237.33 కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. గత ఏడాది కన్నా మూడింతలు అధికంగా నిధులు కేటాయించడం విశేషం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పై గల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పుతున్న వైద్య కళాశాలలకు వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది.
‘‘ఋతు ప్రేమ’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి సిద్దిపేట మున్సిపాలిటీ ఐదవ వార్డు వేదికగా బుధవారం శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్ రావు.
సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రాధమికంగా పౌరులకు కావలసినవి విద్య మరియు వైద్యం. పౌరులు శారీరకంగా,మానసికంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా సామాజికంగా ఎదుగ గలుగుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే దేశంలో ఎక్కడలేని విధంగా పలు వైద్య ఆరోగ్య పథకాలను తీసుకువచ్చి వాటిని పటిష్టంగా అమలు పరుస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.