Take a fresh look at your lifestyle.

తలసీమియా సెంటర్‌లో ఆరోగ్యశ్రీ సేవలు : కలెక్టర్‌

Health Services at Thalassemia Center Collectorవరంగల్‌ ‌రెడ్‌‌క్రాస్‌  ‌తలసీమియా సెంటర్‌లో ఆరోగ్యశ్రీ  ఉచిత సేవలను  జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌గాంధీ హనుమంతు సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ  హైదరాబాద్‌, ‌మంచిర్యాల తరవాత వరంగల్‌లో ఈ సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌సేవలు అభినందనీయనీ అన్నారు.  తలసేమియా  సీకీల్‌ ‌సెల్‌ ‌వ్యాధి  బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలు అందడం వలన  బాధిత కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని నిరుపేదలకు కుటుంబ ఆర్థికభారం లేకుండా ప్రభుత్వం ముందుకువచ్చి  ఆరోగ్యశ్రీలో చేర్చి బాధిత కుటుంబాలకు ఉరాట కలిగిందని అన్నారు.  రెడ్‌‌క్రాస్‌ ఆవరణలో మొక్కను నాటి  తర్వాత జనరిక్‌ ‌మెడికల్‌ ‌షాపును సందర్శించి పేద ప్రజలు తక్కువ ధరకు లభించే జనరిక్‌ ‌మందులను ఉపయోగించుకోవాలన్నారు. తరువాత బ్లడ్‌ ‌బ్యాంకును సందర్శించారు.

 

వరంగల్‌ ‌జిల్లా రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌పి.విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఆమ్రపాలి, ప్రశాంత్‌ ‌జీవన్‌పాటిల్‌ ‌కృషి వల్ల ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రారంభించుకున్నామని వారికీ ప్రత్యేక కృత్ఞతలు కొత్త కలెక్టర్‌కి ప్రత్యేక  అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కి రెడ్‌‌క్రాస్‌ ‌పాలకవర్గం మెమోంటో జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి యం.నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్‌ ‌కమిటీ సభ్యులు, రాష్ట్ర జూనియర్‌ అం‌డ్‌ ‌యూత్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌కమిటీ సభ్యులు ఈ.వి.శ్రీనివాస్‌రావు, డిస్ట్రిక్ట్ ‌గవర్నర్‌ ‌లయన్స్ ‌క్లబ్‌ ‌వరంగల్‌ అం‌డ్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, పాలకవర్గ సభ్యులు బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్‌ ‌టి.విజయలక్ష్మి, నిధుల సేకరణ చైర్మన్‌ ‌పెద్ది వెంకట నారాయణగౌడ్‌, ‌జిల్లా జెఆర్‌సి, వైఆర్‌సి కోఆర్డినేటర్‌ ‌చెన్నమనేని జయశ్రీ, బి.హరిప్రసాద్‌, ‌రెడ్‌‌క్రాస్‌ ‌మెడికల్‌ ఆఫీసర్‌ ‌యస్‌.‌రాంకిషన్‌, ‌రెడ్‌‌క్రాస్‌ ‌మేనేజర్‌ ‌యం.రవీందర్‌రావు రెడ్‌ ‌క్రాస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply