- 2020లో భారత ప్రభుత్వం దేశ ఆరోగ్య వ్యవస్థ బడ్జెట్ 69 వేలకోట్లు
- ప్రతి పౌరుని ఆరోగ్యంపై ఖర్చు నెలకు రు. 92 .32 పైసలు
- దేశ వ్యాప్తంగా సర్కార్ దవాఖానల సంఖ్య 37 వేల725 ..
- 14 లక్షల డాక్టర్లలో 81% ప్రైవేట్ రంగంలో..
ప్రైవేటు కంపెనీలు దేశ హెల్త్ సెక్టార్ ని మంచి లాభాలు పండించే సెక్టర్గా పరిగణిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల గుప్పిట భారతదేశ ఆరోగ్య ఉంది. భారత ప్రభుత్వ పాలసీల వలన అంతర్జాతీయ కంపెనీలకి భారత్ ఆరోగ్య వ్యవస్థ ఒక మంచి మార్కెట్ గా కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలోకి పూర్తి స్థాయి అంటే నూటికి నూరు శాతం ఖీణ×కి ద్వారాలు తెరిచింది. దేశ ఆరోగ్య రంగానికి ఇలా లాభాపేక్ష జబ్బు పట్టి పీడిస్తుంటే ప్రధాని ‘‘జాన్ హై.. తో జహాన్ హై’’ అంటున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ దేశాలకు నూరు బిలియన్ డాలర్లు ఆరోగ్య సెక్టార్ కోసం అప్పు ఇవ్వనుంది. 60 శాతం తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు 40 శాతం ఎమర్జింగ్ మార్కెట్ లాగా వున్నా దేశాలకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇలా ఫండ్స్ ఇవ్వనున్నది. ఈ నిధులలో 4 బిలియన్ డాలర్లు భారత దేశానికి కూడా అప్పుగా రానున్నాయి. 4 బిలియన్ డాలర్లు అంటే 30 వేల కోట్ల రూపాయలు.వరల్డ్ బ్యాంకు కూడా బిలియన్ డాలర్లు భారతదేశానికి ప్రకటించింది ఒక బిలియన్ డాలర్లు అంటే 7630 కోట్ల రూపాయలు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా 16 వేల కోట్ల రూపాయలు అంటే 2.2 బిలియన్ డాలర్లు అప్పు భారతదేశానికి ఇవ్వనుంది. ఇలా ఈ సంస్థలు అన్ని ఇచ్చే మొత్తం కలుపుకుంటే 7.2 బిలియన్ డాలర్లు. ఈ అప్పును మొత్తం ప్రతి భారతీయ పౌరులు తీర్చవలసి ఉంటుంది.
పరిస్థితి ఇలా వున్నప్పుడు భారతీయ పౌరులపై భారత ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది యెంత…? ఈ ప్రశ్నకి సమాధానం భారతదేశంలో ప్రతి పౌరుని ఆరోగ్యంపై భారత ప్రభుత్వం నెలకు 92 రూపాయలు 32 పైసలు ఖర్చు పెడుతుంది. 2020లో భారత ప్రభుత్వం దేశ ఆరోగ్య వ్యవస్థకు కేటాయించిన బడ్జెట్ 69 వేలకోట్లు.భారత దేశంలో పెద్ద చిన్న అన్ని హాస్పిటల్స్ కలుపుకుంటే ప్రభుత్వ వ్యవస్థ ద్వారా నడుస్తున్న హాస్పిటల్ సంఖ్య 37 వేల 725 హాస్పిటల్స్ మాత్రమే. దేశ వ్యాపితముగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ కలుపుకుంటే 7 లక్షల 39 వేలు మాత్రమే వున్నాయి. భారతదేశంలో 700 జిల్లాలు ఉంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఒక వెయ్యి మూడు
డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి. ఆరువేల ఐదు వందల గ్రామాలు ఉన్న భారతదేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు 29 లక్షల 899 మాత్రమే ఉన్నాయి. పట్టణాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 3772 మాత్రమే. ఇక ప్రైవేటు కంపెనీలు దేశ హెల్త్ సెక్టార్ ని మంచి లాభాలు పండించే సెక్టర్గా పరిగణిస్తున్నాయి. అందుకే 2020లో భారతదేశ హెల్త్ సెక్టర్లో ప్రైవేట్ కంపెనీలు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు. అంటే ప్రైవేటు వ్యక్తుల గుప్పిట భారతదేశ ఆరోగ్య ఉంది. భారతదేశ ఆరోగ్య వ్యవస్థలో కేవలం మెడికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్కెట్ ఒక బిలియన్ డాలర్ విలువ చేస్తుంది. అంటే 7630 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇది మొత్తం లాభార్జన ధ్యేయంగా సాగే ప్రైవేటు వ్యక్తుల చేతిలో వుంది.
ఇదికాకుండా భారత ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలోకి పూర్తి స్థాయి అంటే నూటికి నూరు శాతం %ఖీణ×% కి ద్వారాలు తెరిచింది. భారత హాస్పటల్ కు కావలసిన సామాను 80% దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా దిగుమతి చేసుకోవడానికి కారణం కొత్త జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత దిగుమతి చేసుకున్న మెడికల్ సామాను 11 శాతం అధిక ధరలతో అమ్మవచ్చు. దీనితో దేశీయ ఉత్పత్తికి దెబ్బ పడింది. భారత ప్రభుత్వ పాలసీల వలన అంతర్జాతీయ కంపెనీలకి భారత్ ఆరోగ్య వ్యవస్థ ఒక మంచి మార్కెట్ గా కనిపిస్తున్నది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రానున్న రెండు ఏళ్లలో 28 లక్షల 38 వేల 360 కోట్ల విలువ చేయనున్నది ప్రైవేట్ చేతిలో ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థ. ప్రయివేటు కంపెనీలు మెడికల్ టూరిజం అనే కొత్త పదం కనిపెట్టాయి. మెడికల్ టూరిజం మార్కెట్ విలువ 60 వేల కోట్లు . ప్రైవేటు ప్రైమరీ హాస్పిటల్స్ మార్కెట్ సుమారు లక్ష కోట్లు. ఈ ప్రైవేటు హాస్పిటల్స్ దేశంలో ఉన్న 14 లక్షల డాక్టర్లలో 81% డాక్టర్లని ఉద్యోగులుగా కొనేసింది. వీరు కంపెనీలు చెప్పిన మేరకు పనిచేస్తున్నారు. కరోనా వైరస్ తర్వాత భారతీయ ఆరోగ్య రంగం పెట్టుబడికి అనువైన రంగంగా ప్రవేటు కంపెనీలు భావించి 8774 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా వున్నాయి. దేశ ఆరోగ్య రంగానికి ఇలా లాభాపేక్ష జబ్బు పట్టి పీడిస్తుంటే ప్రధాని ‘‘జాన్ హై తో జహాన్ హై’’ అంటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.