Take a fresh look at your lifestyle.

మరింత మెరుగ్గా 108 సేవలు

  • త్వరలో అవసరమైన చోట కొత్త అంబులెన్స్‌లు
  • సిద్ధిపేటలో అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌సపోర్ట్ అం‌బులెన్స్‌ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, నవంబర్‌ 20 (‌ప్రజాతంత్ర బ్యూరో): రాష్ట్రంలో మరింత మెరుగ్గా 108సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌సపోర్ట్ అం‌బులెన్స్‌కు మంత్రి  జెండా ఊపి  ప్రారంభించి సిద్ధిపేట జీజీహెచ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాలు 429 ఉన్నాయనీ,  పాత వాహనాలు తొలగించి అవసరమైన చోట కొత్త వాహనాలు కూడా త్వరలో అందుబాటులోకి  తెచ్చి మరింతగా 108అంబులెన్స్ ‌సేవలను అందిస్తామన్నారు. అదే విధంగా  ప్రభుత్వ  దవాఖానల్లో  మెరుగైనా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌ ‌సిద్ధిపేట ఆసుపత్రి నుంచి హైదరాబాదు నిమ్స్, ‌గాంధీ, టెరిసరీ దవాఖానలకు  తీసుకువెళ్తుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే జీజీహెచ్‌ ఆసుపత్రిలో సిఎంఆర్‌, ‌లయన్స్ ‌క్లబ్‌ ఆధ్వర్యంలో రెండు చిన్న అంబులెన్స్‌లు అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్నాయని, అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌సపోర్ట్ అం‌బులెన్స్ ఎమర్జెన్సీ పేషంట్లకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. ఈ అంబులెన్స్‌లో డ్రైవర్‌తో పాటు ఇద్దరూ టెక్నిషియన్లను అందుబాటులో నిలపాలని వైద్యాధికారులను మంత్రి హరీష్‌రావు తెలిపారు.

అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌సపోర్ట్ అం‌బులెన్స్‌లో ఎన్నో సదుపాయాలు..
అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌సపోర్ట్ అం‌బులెన్స్‌లో అత్యాధునిక 45 రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. డీ ఫిబ్రీలేటర్‌, ‌స్పెన్‌ ‌బోర్డు, స్కూప్‌ ‌స్ట్రెచర్‌, ‌వీల్‌ ‌చైర్‌, ‌బ్యాగ్‌ ‌మస్క్, ‌మల్టీ పారా మానిటర్‌ ‌వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు. అడ్వాన్స్ ‌లైఫ్‌ ‌సపోర్ట్ అం‌బులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారని మంత్రి హరీష్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ఎఫ్‌డిసి మాజీ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్ధిపేట ఏఎంసి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ మెడికల్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ‌తమిళ్‌ అరసు, సూపరింటెండెంట్‌ ‌కిషోర్‌ ‌కుమార్‌, ‌డయాగ్నోస్టిక్‌ ‌హబ్‌ ‌నోడల్‌ అధికారి డాక్టర్‌ ‌కాశీనాథ్‌, ‌వైద్య శాఖ అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply