Take a fresh look at your lifestyle.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వి శుద్ధ అబద్ధాలు: రాష్ట్ర మంత్రి హరీష్ రావు

(ప్రజాతంత్ర ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమావేశమైయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కంటే ఎక్కువగా టే అరెస్ హయాంలో నే అధికంగా వడ్లు కొన్నామని తెలిపారు.

జిల్లాలో సాగు నీరు అందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల అమలు కు రూ. 4427 కోట్లు మంజూరు చేశామన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా అందిస్తున్నాం అన్నారు.

కేంద్ర ప్రభుత్వం యాసంగికి వడ్లు ఎంత కొంటారో చెప్పాలి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బాయిల్డ్ రైస్ పేరిట శుద్ధ అబద్ధాలు చెబుతారా ? అంటూ ప్రశ్నించారు. నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి లో అత్యాధునిక డయాగ్నాస్టిక్ క్రీంద్రం ఏర్పాటు చెశామన్నారు. అనంతరం ఆయన స్థానిక ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడ వైద్యులు, రోగులతో మాట్లాడారు.

Leave a Reply