Take a fresh look at your lifestyle.

చలికాలంలో ఆరోగ్యం జర పైలం

భారతదేశంలో చలికాలం మొదలైపోయింది.చలికాలంలో తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కొద్దీ వ్యాధుల ముప్పు రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్య ప్రతి ఇంటిలోని తీవ్రంగా కనిపిస్తుంది. మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అలాంటి వ్యాధులు దూరం చేసుకోవచ్చు. కానీ మనం రోగ నిరోధక శక్తిని పెంచకపోతే మరియు ఆహారం పట్ల శ్రద్ధ చూపకపోతే ఈ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో శీతాకాలం మొదలైపోయింది ఈ చలికాలంలో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ సీజన్‌ ‌లో ఇన్ఫెక్షన్‌ ‌లు, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు అక్కడకూడా పెరుగుతుంది. ఈ సందర్భంలో అన్ని ఇన్ఫెక్షన్‌,‌వ్యాధుల నుండి శరీరానికి తగినంత రక్షణ ఇచ్చేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ సీజన్‌ ‌లో కొన్ని  పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహర పదార్థాలు తీసుకుంటే చలికాలంలో ఇమ్యూనిటి పవర్‌ ‌రెట్టింపు అవుతుంది. దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే చలికాలంలో యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ ‌సి ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే విటమిన్‌ ‌సి కోవిడ్తో సహా అనేక ఇన్స్పెక్షన్‌ ‌తో పోరాటానికి శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి అందిస్తుంది జలుబు చేసినప్పుడు విటమిన్‌ ‌సి ఫుడ్స్ ‌తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, జామకాయలు, బత్తాయిలు, మొదలైన పండ్లలో విటమిన్‌ ‌సి పుష్కలంగా దొరుకుతుంది. ఆరోగ్యల సిరి అని పిలిచే ఉసిరిలో కూడా ఈ విటమిన్‌ ‌పుష్కలంగా ఉంటుంది. అల్లం, పసుపులో కూడా విటమిన్‌ ‌సి లభిస్తుంది. చలికాలంలో ప్రతి ఇంట్లో అల్లం టీ సర్వసాధారణం. అల్లం ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. దీని కారణంగా చాలామంది ప్రజలు చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి టీ లో అల్లం వెయ్యడానికి ఇష్టపడతారు. అల్లం టీ జలుబును తొలగించడమే కాకుండా అనేక వ్యాధులను నియంత్రించడంలో కూడా చాలా సహాయం పడుతుంది. కానీ శీతాకాలంలో చాలామంది ప్రజలు జలుబును తొలగించడానికి మాత్రమే టీ లో అల్లం వేసుకుంటారు. శీతాకాలంలో అల్లం టీ తాగడం వల్ల కలిగే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో అల్లం టి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అల్లం టీ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ రక్తపోటును నియంత్రించడం కాకుండా గుండెపోటు, రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్‌ ‌స్థాయిని పెంచే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గడానికి శీతాకాలంలో అల్లం టీ ని కూడా తీసుకోవచ్చు. అల్లం టీ శరీరంలోని కొవ్వు స్థాయిని తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం సహాయపడుతుంది. బరువు తగ్గడం చాలా సులభం. గాయం, నొప్పి, శరీరం యొక్క వాపు నుండి బయటపడడానికి అల్లం టీ కూడా ఉత్తమమైనది. అల్లం టీ తాగడం వల్ల కడుపులో ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ ‌వచ్చే అవకాశం అసలు ఉండదు. చలికాలంలో మనం అనేకమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
ఈ చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చలి గాలులో ప్రయాణించాల్సి వస్తే ఉన్ని దుస్తులను వేసుకొని మంకీ క్యాప్‌ ‌తప్పకుండా ధరించాలి. జలుబు, దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చలికాలంలో చర్మంపై మాశ్చరైజర్‌ ‌రాసుకోవాలి. చలికాలంలో చల్లగా ఉండటం వల్ల అంతగా దాహం కాదు. అయినప్పటికీ నీటిని తాగుతూ ఉండాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉంటూ ఆరోగ్యానికి కాపాడుకోవాలి. ప్రధానంగా చలికాలంలో జంక్‌ ‌ఫుడ్‌ ‌తీసుకోకూడదు. ఉప్పు అధికంగా ఉన్న పదార్థాలు అసలు తిసుకురాదు. మంచి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్,  ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ఉత్తమం.  ఆధునిక యుగంలో నిరంతరం ఆరోగ్యం పై అవగాహన తప్పనిసరి. అవసరం ప్రస్తుతం చలికాలంలో ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలని  వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత నడకకు తప్పకుండా వెళ్లాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్‌ ‌లేదా మాస్క్ ‌ధరించాలి. అయితే చలికాలంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
image.png
లాకవత్‌ ‌చిరంజీవి నాయక్‌
‌కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌

Leave a Reply