Take a fresh look at your lifestyle.

హెల్త్ ‌క్లినిక్స్ ‌పనులు వేగవంతం చేయాలి

  • రాష్ట్రవ్యాప్తంగా 10,011 హెల్త్ ‌క్లినిక్స్ ‌నిర్మాణం
  • నాడునేడు కింద వైఎస్సార్‌ ‌హెల్త్ ‌క్లినిక్స్, ‌కంటివెలుగుపై సిఎం జగన్‌ ‌సమీ క్ష

అమరావతి,నవంబర్‌10 : ‌వైఎస్సార్‌ ‌హెల్త్ ‌క్లినిక్స్ ‌పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. హెల్త్ ‌క్లినిక్స్ ‌పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్‌ ‌హెల్త్ ‌క్లినిక్స్ ‌నిర్మాణం ప్రారంభంకాగా, ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు, వైఎస్సార్‌ ‌హెల్త్ ‌క్లినిక్స్, ‌కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్‌ ‌కార్యాలయంలో సీఎం సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీల్లో నాడు నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయనని అధికారులు వివరించారు. డిసెంబర్‌ ‌నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్నారు.

అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు. వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలని సిఎం ఆదేవించారు. అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామని అధికారులు తెలిపారు.మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు.  16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతినీ సక్షించిన సీఎం, ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్‌ ‌కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలుపై స్పందిస్తూ వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్‌ ‌స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సక్ష చేశారు. ఆరోగ్య శ్రీసేవలు బలపడ్డాయని, కాన్సర్‌ ‌రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఎం అన్నారు. వైఎస్సార్‌ ‌కంటి వెలుగుపైనా సీఎం సక్ష నిర్వహించారు. ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్నారు. కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్‌ ‌నిర్వహించాలని సూచించారు.

కోవిడ్‌ ‌పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్‌ ‌హెల్త్ ‌క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర పక్రియగా కొనసాగించాలని జగన్‌ అన్నారు. హెల్త్ ‌హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సక్ష చేశారు. వైద్యంకోసం ఇతర రాష్టాల్రకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం తీసుకుని రావాలన్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ ‌హబ్స్‌పైనా ఆరా తీసారు. మొత్తం 16 చోట్ల  హెల్త్ ‌హబ్స్ ఏర్పాటు కానుండగా,ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు పూర్త య్యింది. జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ ‌హబ్స్. ‌కోవిడ్‌ ‌నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఈ సక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌, ‌సీఎస్‌ ‌డాక్టర్‌ ‌సర్‌ ‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌, ‌వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి  (కోవిడ్‌ ‌మేనేజిమెంట్‌ అం‌డ్‌ ‌వ్యాక్సినేషన్‌) ఎం ‌రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ ‌గుల్జార్‌, 104 ‌కాల్‌ ‌సెంటర్‌ ఇం‌ఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ‌కాటమనేని భాస్కర్‌, ‌వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్‌ ‌నవీన్‌కుమార్‌, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎం‌డీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌వి వినోద్‌ ‌కుమార్‌, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎం‌డీ జేవియన్‌ ‌సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply