Take a fresh look at your lifestyle.

జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా.. ఆహారంతో ఆరోగ్యం, అభివృద్ధి

ఐ.సి.ఎం.ఆర్‌ ‌విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మనం ‘ప్రతి రోజూ పళ్ళెంలో’  చిరుధాన్యాలు 270 గ్రాములు (20 గ్రాముల ప్రొటీన్లు), పప్పుదినుసులు 90 గ్రాములు (ప్రొటీన్లు 21 గ్రాములు), పాలు, పెరుగు 300 గ్రాములు (ప్రొటీన్లు 10 గ్రాములు), కూరగాయలు 300 గ్రాములు (ప్రొటీన్లు 4 గ్రాములు), పండ్లు 100 గ్రాములు (ప్రొటీన్లు 1 శాతం) ఎండు ఫలాలు (ప్రొటీన్లు 4 గ్రాములు), కొవ్వు, నూనెలు 27 గ్రాములు ఉండే విధంగా చూసుకోవాలి.  దీనివల్ల  శరీరానికి సమతుల ఆహారం అంది, రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లను తట్టుకునే సామర్ధ్యం వృద్ధి చెందుతుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సహజసిద్ధంగా ఆహారం ద్వారా పెంచుకోవటం ఒక్కటే ఈ వైరస్‌ ‌నుంచి మనల్ని మనం రక్షించుకునే ఏకైక మార్గం.

ప్రభుత్వం పౌష్టికాహార లోప సమస్య నివారణకు ఎన్ని పథకాలు అమలుచేస్తున్నా  ఆహార నియమాలు, పౌష్టికాహారం పట్ల ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.  ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేని ఫలితంగా ఓవైపు రక్తహీనత లాంటి సమస్యలు, మరోవైపున అధిక బరువు/ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు.  దేశంలో 21 శాతం మహిళలు, 19 శాతం పురుషులు అధిక బరువు/ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని ఎన్‌.ఎఫ్‌.‌హెచ్‌.ఎస్‌-4 ‌సర్వే నివేదిక చెబుతోంది.  మన రాష్ట్రంలో 19 శాతం మహిళలు, 12.1 శాతం పురుషులు ఈ అధిక బరువు సమస్య కారణంగా జీవనశైలి వ్యాధులైన సుగర్‌, ‌బి.పి, కేన్సర్‌, ‌బ్రెయిన్‌ ‌స్ట్రోక్‌ (‌పక్షవాతం)లకు గురవుతున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్యంపట్ల ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలంతా తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని ఐ.సి.ఎం.ఆర్‌ ‌చెబుతోంది.  ఐ.సి.ఎం.ఆర్‌ ‌విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మనం ‘ప్రతి రోజూ పళ్ళెంలో’  చిరుధాన్యాలు 270 గ్రాములు (20 గ్రాముల ప్రొటీన్లు), పప్పుదినుసులు 90 గ్రాములు (ప్రొటీన్లు 21 గ్రాములు), పాలు, పెరుగు 300 గ్రాములు (ప్రొటీన్లు 10 గ్రాములు), కూరగాయలు 300 గ్రాములు (ప్రొటీన్లు 4 గ్రాములు), పండ్లు 100 గ్రాములు (ప్రొటీన్లు 1 శాతం) ఎండు ఫలాలు (ప్రొటీన్లు 4 గ్రాములు), కొవ్వు, నూనెలు 27 గ్రాములు ఉండే విధంగా చూసుకోవాలి.  దీనివల్ల  శరీరానికి సమతుల ఆహారం అంది, రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లను తట్టుకునే సామర్ధ్యం వృద్ధి చెందుతుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సహజసిద్ధంగా ఆహారం ద్వారా పెంచుకోవటం ఒక్కటే ఈ వైరస్‌ ‌నుంచి మనల్ని మనం రక్షించుకునే ఏకైక మార్గం.  మన శరీరంలో తెల్ల, ఎర్ర రక్తకణాలు ఉంటాయి.

ఎర్ర రక్తకణాలు మన శరీరంలో శక్తిని (హిమోగ్లోబిన్‌) అం‌దిస్తాయి.  తెల్ల రక్తకణాలు శరీరంలోకి ఎటువంటి వైరస్‌లు, బాక్టీరియా ప్రవేశించి అనారోగ్యానికి గురిచేయకుండా నిరంతరం రక్షణ కవచంలా పని చేస్తాయి.  మనం బలవర్ధక, సమతుల ఆహారం తీసుకొనటం ద్వారా తెల్ల రక్తకణాలు బాగా వృద్ధి చెంది, రోగ నిరోధక వ్యవస్థ బలపడి,కరోనా వైరస్‌ ‌నుంచి రక్షించుకునేందుకు ఉపయోగపడుతుంది.  ఇంకా మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను సహజసిద్ధంగా పెంచుకునేందుకు ప్రతి రోజూ కనీసం అరగంట అయినా శారీరక వ్యాయామంతో పాటు, అన్ని పోషక విలువలు గల ఆహారం అంటే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు,జింక్‌, ‌కాల్షియం, పొటాషియం, సిలీనియం, ఫోలిక్‌ ‌యాసిడ్‌ ‌లాంటి సూక్ష్మ పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ప్రతి రోజూ తీసుకోవాలని ఐ.సి.ఎం.ఆర్‌ ‌సూచిస్తోంది. ప్రతి రోజూ యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ ‌స్థాయి పెరుగుతుంది.

అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.  అలాగే, బియ్యం, గోధుమలతోపాటు, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి తృణ ధాన్యాలు కూడా తరచూ తీసుకొంటూ ఉండాలి.  బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కొర్రలు, సామలు, ఆండుకొర్రలు, ఊదలు, అరికలు లాంటి సిరి ధాన్యాలను తీసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.  పొట్టులేని ఈ ధాన్యాల వలన శరీరానికి తగిన శక్తిని ఇవ్వటమే కాకుండా, పీచు శాతం ఎక్కువ ఉండటం మూలంగా త్వరగా జీర్ణం అవుతాయి.  అంతేకాకుండా, అనేక సూక్ష్మ పోషక పదార్థాలు శరీరానికి అందుతాయి.

దీర్ఘకాలంలో జీవనశైలి వ్యాధులు రాకుండా చేస్తాయి.  రోజుకు కనీసం 8 గ్లాసుల పరిశుభ్రమైన గోరువెచ్చని వేడి నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి. శరీరానికి ఎండ తగిలేలా ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంట అయినా నడవటం వలన ‘డి విటమిన్‌’ ‌లభిస్తుంది.ఉప్పు వాడకం బాగా తగ్గించాలి.వంట నూనెలను తరచూ మారుస్తూ ఉండాలి.  ‘సి విటమిన్‌’ ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా ఫలం, జామ లాంటి పండ్లలో ఏదో ఒకటి ప్రతి రోజూ తినాలి. అన్నింటికీమించి మద్యపానం, ధూమపానం, గుట్కా నమలటం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.  పైన పేర్కొన్న విధంగా రోజూ మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తూ ఉంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  దీని వలన ఒక్క కరోనానే కాదు ఏ అనారోగ్యాలు మన దరి చేరవు.  మన ఆరోగ్యం మన చేతలలోనే ఉంది.  

మనం (ప్రజలు) ఆరోగ్యంగా ఉంటేనే విధులను సక్రమంగా నిర్వహించగలం.  ఉత్పాదక కార్యకలాపాలలో పాల్గొనగలం.  దేశ ప్రగతికి మన వంతు సహకారాన్ని అందించగలం.  కొవిడ్‌-19 ‌వైరస్‌ ‌విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆహారానికి మించిన ఔషదం లేదని ప్రజలంతా గుర్తించాలి.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నట్లు ప్రతి రోజూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశిద్దాం.

– వర్గంటి గాయిత్రి
మీడియా కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌
‌పత్రికా సమాచార కార్యాలయం

Leave a Reply