Take a fresh look at your lifestyle.

కొరోనా పేషెంట్లకు ఇంట్లోనే వైద్యం

  • ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స
  • ఉచితంగా ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు
  • అధికారులతో మంత్రి ఈటెల సమీ క్ష 

కొరోనా నేపథ్యంలో ఇప్పుడు  అత్యవసరమైతే తప్ప హాస్పిటల్‌లో ఉండాలనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొరోనా రోగులను కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు సూచించినట్లు చేయమని సర్కారు చెబుతోంది. ఇంటి వద్ద ఉన్న కొరోనా రోగులకు మరింత వెసులు బాటు కలిగించేందుకు వీలుగా తెలంగాణ సర్కారు కొరోనా కిట్‌లను ఉచితంగా అందజేయనుంది. చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఎంత మంది కొరోనా రోగులు చికిత్స పొందుతున్నారో దాదాపు అదే స్థాయిలో ఇంటి వద్ద ఉండి చికిత్స పొందుతున్న వారు ఉన్నారు.

వైరస్‌ ‌లక్షణాలు బయటపడినా హాస్పిటల్‌కి వెళ్లాలంటే భయపడుతున్నారు. దానికి తోడు రోగితో పాటు మరొకరు తోడు వెళ్లాలి. సామాజిక వ్యాప్తి నేపథ్యంలో పేషెంట్‌, ‌వారి తాలూకు బంధువు ఇద్దరూ భయపడాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సర్కారు ఈ ఉచిత కిట్‌ ‌నిర్ణయం తీసుకుంది. 17 రోజుల పాటు •ం క్వారంటైన్‌లో ఉన్న వారి కోసం ఈ కిట్‌ అం‌దించనుంది. బాధితుడు ఇంటి నుండే చికిత్స పొందుతున్నాడనే సమాచారం వైద్యులు నిర్ధారించుకోగానే వారికి సప ప్రభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా వైద్య సిబ్బంది బాధితుని ఇంటికెళ్లి అందజేస్తుంది. ఒకే ఇంట్లో ఒకరికి మించి కొరోనా రోగులు ఉన్నా అందరికీ ఉచితంగా అందిస్తుంది. వైద్య సిబ్బంది తరచుగా ఫోన్‌ ‌చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఇక కిట్‌లో అందించే వస్తువులు.. శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ‌పారాసిటమల్‌, ‌యాంటీ బయాటిక్స్, ‌లివోసెటిరిజైన్‌, ‌విటమిన్‌ ‌సి,ఇ,డి3, ఎసిడిటీని తగ్గించే ఔషధాలు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు అని అవగాహన పెంపొందించే పుస్తకం ఉంటాయి. ఈ నిర్ణయంతో అనేకులకు మేలు జరుగనుంది. ప్రజల్లో కూడా భరోసా దక్కనుంది.

Leave a Reply

error: Content is protected !!