Take a fresh look at your lifestyle.

రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు

  • ఫెడరల్‌ ‌వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయి
  • నీటి పంపకాల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది
  • ఘాటుగా స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ
  • కృష్ణా కరకట్ట పనులకు సిఎం జగన్‌ ‌శంకుస్థాపన

అమరావతి,జూన్‌ 30 : ‌రాజకీయ లబ్దికోసం తెలంగాణ నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించడం సరికాదని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారయణ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. తాము తెలంగాణ మంత్రుల్లా అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం లేదని, నీటి పంపకాల అంశంపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ‌ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని, ఫెడరల్‌ ‌వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. చట్ట పరిధి దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ పనులు జరుగుతున్నా యన్నారు. త్వరలోనే సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

అలాగే త్వరలోనే రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇదిలావుంటే ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అం‌డ్‌ ‌సస్టెయినబుల్‌ ‌సిటీ కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ ‌నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 టర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించ నున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌బొత్స సత్యనారాయణ, సూచరిత, రంగనాధ రాజు, నారాయణ స్వామి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ ‌వివేక్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌-1 ‌నుంచి ఎన్‌-3 ‌రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్‌ ‌యాక్సిస్‌ ‌రోడ్‌, ‌గొల్లపూడి- చిన్నకాకాని- విజయ వాడ బైపాస్‌ ‌రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం,రాయపూడి, బోరుపాలెం, అబ్బు రాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రా పురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడునుంది.

Leave a Reply