Take a fresh look at your lifestyle.

పేకాట క్లబ్‌తో తనకు సంబంధం లేదు

గుంటూరు,జూలై 30 : పేకాట క్లబ్‌ ‌వ్యవహారంలో తనపై జరుగుతున్న కుట్రను చేదించాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఎస్పీని శ్రీదేవి కలిశారు.తనపై కావాలనే కొంత మంది కుట్ర చేస్తున్నారని, విజయవాడ కేంద్రంగా డియాకు తప్పుడు సమాచారం ఇచ్చి వార్తలు వేయిస్తున్నారని ఆరోపించారు.తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై డీజీపీని కూడా కలుస్తానని తెలిపారు. డాక్టర్‌గా పని చేసిన మహిళ ఎమ్మెల్యేపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి మండిపడ్డారు. తనతో ఫోటోలు దిగినంత మాత్రనా తన అనుచరుడు అనడం సబాబు కాదన్నారు.

నియోజకవర్గం లోని ప్రజలు అందరు తన సన్నిహితులేనని ఆమె చెప్పారు. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని శ్రీదేవి ప్రకటించారు. పేకాట క్లబ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేకాట జరుగుతున్న నంబూరు గ్రామం తర నియోజకవర్గం కాదు. పక్క నియోజకవర్గంలో పేకాట జరిగితే తాడికొండ నియోజకవర్గానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై దుష్పచ్రారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

error: Content is protected !!