Take a fresh look at your lifestyle.

భద్రాచలంకు 100 కోట్లు ఇస్తానని ఇవ్వలేదు

  • రామయ్యను మోసం చేసిన కేసీఆర్‌కు తగిన శాస్తి జరుగుతుంది
  • ఏజన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ
  • 10 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చింది
  • భద్రాచలంను అన్ని విధాలుగా అన్యాయం చేసింది టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం
  • టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి

భద్రాచలం, ప్రజాతంత, ఫిబ్రవరి 14 : ఏజన్సీ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేసిందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి విమర్శించారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర మంగళవారం నాడు భద్రాచలం చేరుకుంది. ఈ సందర్భంగా ముందుగా ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే అంబేద్కర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్‌ ‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దేశాన్ని బిజెపి నాశనం చేస్తుందన్నారు. రాహూల్‌ అధ్వర్యంలో 150రోజులు పాదయాత్ర చేసారని, దేశంలో బిజేపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలను కనపడకుండా చేసేందుకు పాదయాత్ర చేసారని, ఆయన ఆదేశాలతో హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రామరాజ్యంగా పాలించాల్సి ఉండగా నిర్లక్ష్యం చేసారని, శ్రీరామనవమి రోజున కనీసం తలంబ్రాలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రికి అవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

రామాలయం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్నాని ఇవ్వలేదని, వరదల సమయంలో భద్రాచలం వొచ్చిన ముఖ్యమంత్రి 1000 కోట్లు ఇస్తానని అవీ ఇవ్వలేదని, రామయ్యను మోసంచేసిన కేసీఆర్‌ ‌కాలగర్భలో కలిచిపోతాడన్నారు. సీతమ్మసాగర్‌లో భూములు కోల్పోయిన వారికి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. మిర్చిపంటకు పురుగులు వొచ్చినా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు వేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. భద్రాచలంకు 20వేల కోట్లు రావాల్సి ఉండగా  ప్రభుత్వం ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేదని అన్నారు. 23 లక్షల కోట్లు కేసీఆర్‌ ‌దోచుకున్నాడని ఆరోపించారు. గాడిదలు కాసుకునే రేగాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట మేము వోట్లు అడుగుతామని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఉన్నచోట మాత్రమే టిఆర్‌ఎస్‌ ‌వోట్లు అడుగుతారా అని ఛాలెంజ్‌ ‌విచిరారు.

తెలంగాణాలో బిజెపి వొచ్చే పరిస్ధితి లేదని, 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వొస్తుందని, కొత్త ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఇస్తామని, రైతులకు 2లక్షలు రూపాయలు రుణమాఫీ చేస్తామని, విద్యార్ధులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇస్తామని, ఆరోగ్యశ్రీ పథకంలో 5లక్షలు ఇస్తామని, 500లకే గ్యాస్‌ ‌సిలెండర్‌ ఇస్తామన్నాని రేవంత్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికి పోడు భూములు పట్టాలు ఇస్తామని, నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్‌ ‌గురించి చేప్పి గెలిపించాలని కోరారు. భద్రాచలంకు 7 మండలాలు ఆంధ్రాకు పంపించారని, 5 పంచాయితీలు తీసుకోవల్సిన అవసరం ఉందని, భద్రాచలంను చీల్చి మూడు ముక్కలు చేసారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్‌, ‌భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, వి.హనుమంతరావు, మల్లు రవి, ఎడవల్లికృష్ణ, నాగా సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్‌ ‌రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు
భద్రాచలం ప్రవేశించడానికి ముందు రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్ర మంగళవారం మండల పరిధిలోని సారపాకకు చేరుకుంది. ఐటిసి గెస్ట్ ‌హౌస్‌ ‌నుండి పాదయాత్రకు మండలంలోని కాంగ్రెస్‌ ‌శ్రేణులు భారీగా హాజరై ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ యువ నాయకులు బట్ట విజయ గాంధీతో పాటు సీనియర్‌ ‌నాయకులు  మారం వెంకటేశ్వర్‌ ‌రెడ్డిలతో పాటు పలువురు సీనియర్‌ ‌నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు రేవంత్‌ ‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీ జన సందోహంతో పాదయాత్ర సారపాక ప్రధాన కూడలి నుండి బ్రిడ్జి మీదుగా భద్రాచలం చేరుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా పలువురు ప్రజా సమస్యలపై వినతిలు రేవంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కు, భద్రాచలం శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య, సీనియర్‌ ‌నాయకులు సంబాని చంద్రశేఖర్‌లకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని ముంపు బాధితులను నెట్టేట ముంచిన కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్లుగా పోడు భూముల సమస్య అలాగే ఉందని ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ ‌రెడ్డి హయాంలో పోడు భూముల సమస్యను పరిష్కరించారని అర్హులైన పోడు దారులకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె ధించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత పోడు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చక్రవర్తి, కాంగ్రెస్‌ ‌పార్టీ నియోజకవర్గ బి బ్లాక్‌ అధ్యక్షరాలు బర్ల నాగమణి, నాయకులు పూలపల్లి సుధాకర్‌ ‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు,  వెంకటేశ్వర్లు, తాటి వీరాంజనేయులు, కోమటిరెడ్డి మోహన్‌ ‌రెడ్డి ,కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా మైనార్టీ సెల్‌ ‌కన్వీనర్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌, ‌పార్టీ మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి ,ప్రముఖ న్యాయవాది భజన సతీష్‌, ‌మండల ప్రధాన కార్యదర్శి చల్ల వెంకటనారాయణ, మంద నాగరాజు ,కనితి కృష్ణ , మండల ప్రధాన కార్యదర్శి  కువ్వరపు వెంకటేశ్వర్లు, రహీం ఖాన్‌, ‌కైపు శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply