Take a fresh look at your lifestyle.

దేశంలో అశాంతికి కారణం..మోడీ ప్రభుత్వంలో సమస్యలు పేరుకుని పోవడమే..!

” వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 5 నుంచి ఒక శాతానికి తగ్గింది. విద్యుత్‌ ఉత్పత్తి 8 నుంచి 1.8 శాతానికి తగ్గింది. మూడు దశాబ్దాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం దెబ్బతింది. ఈ పరిస్థితికి తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూయో, ప్రస్తుత కాంగ్రెస్సో బాధ్యత కాదు..పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ప్రభుత్వం తమ పాట్ల గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనంతో ఉన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆగ్రహం అంతా ఎన్‌ఆర్‌సీ, సిఏఏలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో వ్యక్తం అవుతోంది. ఇది నమ్మశక్యంగా లేకపోవచ్చు..కానీ వాస్తవం. “

The cause of unrest in the country ..Problems in the Modi governmentనరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగుతున్న ఆందోళనలు దావాలనంలా వ్యాపిస్తున్నాయి. తాజా పరిస్థితిని నేను ఆసక్తిగా గమనిస్తున్నాను. మోడీ మొదటి టరమ్‌లో నల్లధనాన్ని వెలికి తీయడం కోసం పెద్ద కరెన్సీని రద్దు చేసినప్పుడు కూడా ఈ మాదిరి ఆందోళనలు జరుగలేదు. పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ చట్టం(సిఏఏ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు తుపాకీ గుళ్ళకు సైతం వెరవకుండా ఆందోళన సాగిస్తున్నారు. పెద్ద కరెన్సీ రద్దు చేసినప్పుడు దేశంలో 85 శాతం మంది నష్టపోయారు. దాంతో వారంతా ఆందోళన సాగించారు. ఇప్పుడు పౌరసత్వ చట్టం సవరణకు నిరసనగా ప్రారంభమైన ఆందోళనలు అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ ‌వంటి ఉన్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు ప్రతిభ గల విద్యార్థులు డిగ్రీ పట్టాలనూ, అవార్డులను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై నేను లోతుగా ఆలోచించడం మొదలు పెట్టాను, అవి చాలా తికమక పెట్టాయి. సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించడం మొదలు పెట్టాను. ఉన్నపళంగా నాకు ఆలోచన తట్టింది. 101 సూక్ష్మ విధానాలు మనకు తోడ్పడవచ్చు. చాలా మంది విద్యార్థులు, విద్యా వేత్తలు, అధికారులు మోడీ పాలనకు వ్యతిరేకంగా అంత ఉధృతంగా ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎన్‌ఆర్‌సీ, సిఎఎలపై ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా ఆందోళనలు ఇంకా సాగుతున్నాయి. ఇదంతా ఎన్‌ఆర్‌సీ వల్లనేనా? మోడీ చెబుతున్నదేమంటే ఎన్‌ఆర్‌సీ గురించి కేబినెట్‌లో చర్చించనేలేదని. పార్లమెంటులోనూ అంతే, 1950లో భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌ప్రధానులు పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, లిఖాయత్‌ ఆలీఖాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ‌మన్నించని మాట నిజమే. అందుకు సిఏఏ పరిష్కారం కాదు.

The cause of unrest in the country ..Problems in the Modi governmentజమ్ము, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు తర్వాతే ఆందోళనలు జరుగుతున్నాయా? కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంలో కొంత అర్థం ఉంది. ఏడు దశాబ్దాల తర్వాత జమ్ము,కాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా చేయడం జరిగింది. ఈ విషయంలో వివాదం లేదు. అనేక దశాబ్దాలుగా ఇది జాతీయ స్థాయిలో పలువర్గాల డిమాండ్‌గా ఉంది. మరి ఎందుకు ప్రజలు అధిక సంఖ్యలో ఆందోళనలు జరుపుతున్నారు. ప్రతిపక్షాలు జరుపుతున్న ఆందోళన కాదిది. సామాన్యులు జరుపుతున్న ఆందోళన ఇది. వీరందరినీ కాంగ్రెస్‌ ‌వీధుల్లోకి తీసుకుని వచ్చిందా? వారి ఆగ్రహం కొన్ని నిర్ణీత అంశాల వల్ల పుట్టింది కాదు. మోడీ అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి ఎదురైన అనుభవాలతో వారిలో గూడుకట్టిన అసంతృప్తి వారిని అలా వీధుల్లోకి రప్పించింది. 2014 నుంచి ప్రజల్లో అసంతృప్తి లోలోన గూడుకట్టుకుని ఒక్కసారిగా పెల్లుబికింది. రాచపుండు బద్దలైనట్టుగా ఒక్కసారిగా బద్దలైంది. ఇది సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌కాదు, ఒంటె మెడలోకి దూసుకుని పోయిన అస్త్రం లాంటిది. మోడీ అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి ప్రజలు అనేక సమస్యలతో సతమతమవు తున్నారు. ఇందుకు సుపరిపాలన లేకపోవడమే కారణం. కేన్సర్‌ ‌రోగి బాధ పడుతుంటే, చికిత్స ఎలా చేయాలా అని వైద్యుడు ఆలోచిస్తూ కూర్చున్నట్టు ఉంది పరిస్థితి.

భారత ఆర్థిక వ్యవస్థ పాతాళానికి చేరుకుందన్న విషయం ప్రజలు గ్రహించారు. ఉద్యోగాల సృష్టి జరగకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి దిగజారడం, నిరుద్యోగం పెరగడం.. ఈ రెండింటి వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేశాన్ని ఈ రెండూ పీడిస్తున్నాయి. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే.. అణగారిన, నిస్సహాయ వర్గాలకు జరుగుతున్న అన్యాయం. అన్యాయం జరుగుతున్న సమాజంలో భాగస్వాములుగా ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. మూకదాడులు, హిందూ సమాజానికి చెందిన ఉగ్రవాదులకు పరోక్షంగా చట్టపరమైన రక్షణ, అసంతృప్తిని వ్యక్తం చేసే వారిని అణచివేయడం వంటివి చూసి ప్రతివారూ కుతకుత ఉడికిపోతున్నారు. 2014 నుంచి ఇదే పరిస్థితి. అయినప్పటికీ భారతీయులలో సహనం ఎక్కువ కనుక, ఎంతో ఓరిమితో ఇంతవరకూ భరిస్తూ వచ్చారు.

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణం రద్దు తర్వాత పరిస్థితులు మారాయి. కాశ్మీర్‌లో ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికి దేశంలోని వనరులన్నింటినీ అక్కడికి ప్రభుత్వం తరలించడాన్ని ప్రజలు గ్రహించారు. కాశ్మీర్‌ ‌సమస్యపై జనం కలవరపడ్డారు. 370వ అధికరణం రద్దు తర్వాత ఉగ్రవాదుల దాడులు తగ్గాయి. పోలీసులపై రాళ్ళు రువ్వే సంఘటనలు కూడా తగ్గాయి. మహిళలు ధైర్యంగా దుకాణాలకు వచ్చి వస్తువులు కొనుగోలు చేయగలుగుతున్నారు. చెందురు,మదురు సంఘటనల వల్ల సామాన్యుని జీవితంలో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ తర్వాత అసోంలో ఎన్‌ఆర్‌సీ వొచ్చింది. అక్కడి పరిస్థితిపై దేశమంతటా వివరాలు తెలిశాయి. ఎలక్ట్రానిక్‌ ‌ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అక్కడి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంది.

అక్కడ ఏదో తేడా కనిపిస్తోందని జనానికి ధ్రువపడింది. అయితే, అక్కడి వాస్తవ పరిస్థితిని అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే, అధికారంలో ఉన్న పార్టీకి ఎన్‌ఆర్‌సీతో పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. దాంతో పౌరసత్వ చట్టం సవరణను తీసుకుని వచ్చారు. సిఏఏ వల్ల కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకూ అన్ని ప్రాంతాల ప్రజలూ ఇబ్బందులు గురి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్‌ఆర్‌సీ వల్ల తమకు ఎక్కువ ఉపయోగం లేదనుకున్నారు. అందుకే సిఏఏని తెచ్చారు. సిఏఏ వల్ల నష్టాలేమిటో జనం క్రమంగా గ్రహించారు. అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించింది, మరో వంక ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. జిడిపి 8 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. అది కూడా అనుమానమే. వస్తువుల ఉత్పత్తి చేసే పరిశ్రమ మైనస్‌ ‌పది శాతం తగ్గింది. 1991 తర్వాత ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 5 నుంచి ఒక శాతానికి తగ్గింది. విద్యుత్‌ ఉత్పత్తి 8 నుంచి 1.8 శాతానికి తగ్గింది. మూడు దశాబ్దాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం దెబ్బతింది. ఈ పరిస్థితికి తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూయో, ప్రస్తుత కాంగ్రెస్సో బాధ్యత కాదు..పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ప్రభుత్వం తమ పాట్ల గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనంతో ఉన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి,ఆగ్రహం అంతా ఎన్‌ఆర్‌సీ, సిఏఏలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో వ్యక్తం అవుతోంది. ఇది నమ్మశక్యంగా లేకపోవచ్చు..కానీ వాస్తవం.,
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Tags: nrc, caa, Expressing, concerns, against nrc caa, bjp govt, modi against, congress

Leave a Reply