కొవిడ్ నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తోడుగా నిలిచింది. కొవిడ్ నియంత్రణ చర్యలకు ఉపయోగించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 1.55 కోట్లు విరాళమిచ్చింది.
ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భటియా, తెలంగాణ స్టేట్ హెడ్ శ్రవణ్ కుమార్ కలిసి మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందించారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.