Take a fresh look at your lifestyle.

కాలేశ్వరంతో ఒక్క ఎకరా అయినా పారిందా? రీ డిజైన్‌ ‌పేరుతో దోచి పెట్టారు: భట్టి

: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా.. అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…నిండుగా ఉన్న తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్ ‌ప్రాంతాన్ని విస్మరించి రీడిజైన్‌ ‌పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్  ‌నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షా 15 వేల కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్  ‌ద్వారా ఒక్క ఎకరానికి నీరు పారిందా అని ఆయన నిలదీశారు. కాళేశ్వరంపై చర్చకు తాము సిద్ధమని టీఆర్‌ఎస్‌ ‌నేతలకు భట్టి విక్రమార్క సవాల్‌ ‌విసిరారు.

ఎగువ ప్రాంతాల్లోని వరద నీటిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో కలిపి ఇవే కాళేశ్వరం నీళ్లని తెలంగాణ ప్రజలను తప్పుతోవ పట్టించారని మండిపడ్డారు. ఆనాడు వైఎస్సార్‌ 500 ‌కోట్లతో శంకుస్థాపన చేసిన కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో కోట్లు గడించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుటుంబానికే దక్కుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. శ్రీధర్‌ ‌బాబు, జీవన్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply