కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ధరణి యాప్‌తో భవిష్యత్తులో అనే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తుల వివరాల సేకరణలో అనేక అనుమానాలు ఉన్నాయని, గత ప్రభుత్వాలు కొత్త చట్టం తెచ్చే సమయంలో.. కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకునేవారని తెలిపారు. గురువారం అసెంబ్లీ లోని మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ …అసెంబ్లీలో మాట్లాడటానికి కాంగ్రెస్ సభ్యులకు సమయం ఇవ్వలేదని విమర్శించారు ప్రజల ఆస్తులపై ప్రైవేట్ ధరణి యాప్ అప్పులు తీసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని తెలిపారు .. దేశంలో ఎక్కడా లేని ధరణి వ్యవస్థ తెలంగాణలో అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల.. వివరాలను ధరణిలో పెట్టి చూపిస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.అలా టీఆరెస్ నేతలు అధికారాలు చేసిన్నపుడు ప్రజలు స్వచ్చందంగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు.కూలినాలి ,చిన్న చిన్న వ్యాపారాలు ,ఆటో రిక్ష ,దేవాలయంలో పని చేసే పూజారులు ,ఇమామ్ ,పాస్టర్ లు పైసా పైసా దాచుకొని ఒక 20 ఏళ్ల తర్వాత జమ చేసుకున్న డబ్బుతో ఇళ్లు కొనుకుంటే లెక్కలు ఎలా చూపించగలరని ఇక అలాంటివారిని ఐటీ డిపార్ట్మెంట్ ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు .ఈ ప్రభుత్వ తీరు గడ్డిపోస తప్పు చేస్తే గడ్డిమోపు ని తగలబెట్టిన్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.