Take a fresh look at your lifestyle.

మరి కొంతకాలం లాక్‌డౌన్‌ ‌కొనసాగించండి

  • ఆర్థికంగా రాష్ట్రాలను ఆదుకోవాలి
  • వీడియో కానఫరెన్స్‌లో ప్రధానికి పలువురు సిఎంలు వినతి
  • కొరోనా కట్టడి చర్యలపై సిఎంలతో ప్రధాని ఆరా

కొరోనా కట్టడికి మరి కొన్నాళ్లపాటు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక లాక్‌డౌన్‌ ‌కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని మరికొందరు ప్రధానిని కోరారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ‌మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. లాక్‌ ‌డౌన్‌ ‌విధించిన తర్వాత నాలుగో సారి ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కొరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ ‌పొడిగింపు, ఆంక్షల సడలింపు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా సక్షించారు. సుమారు రెండున్నర గంటలకుపైగా ఈ వీడియో కాన్పరెన్స్ ‌జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కొరోనా నియంత్రణ చర్యలు బాగానే పనిచేస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌తో కేసులు కూడా తగ్గించగలిగామని అన్నారు. అంతేగాక వలస కూలీలకు అందుతున్న సాయంపై కూడా ముఖ్య మంత్రులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ‌వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డిలతో పాటు తొమ్మిది రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పట్టుపడుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా రోజురోజుకూ వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్య 1000కి చేరువులో ఉంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో భాగంగా వివిధ రాష్టాల్ర ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారాన్ని సేకరిస్తూనే వారి నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు. అయితే వైరస్‌ ‌తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాంతాల వారిగా సడలింపు ఇస్తుందని తెలుస్తోంది. మరికొన్ని సేవలకు సడలింపు ఇస్తూనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేలా కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగానే వైరస్‌ ‌వ్యాప్తి అధికంగా ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేసి కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బస్సులు, ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి ఇస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్‌, ‌తమిళనాడు లాంటి రాష్టాల్రు మాత్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ ఆం‌క్షలను కొనసాగించాలని కోరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్‌ ‌విజృంభిస్తోంది. అదే స్థాయిలో మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే తీవ్ర అనార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రాష్టాల్ర విజ్ఞప్తి మేరకు లాక్‌డౌన్‌ ‌కొనసాగింపుకే మోదీ మొగ్గుచూపుతారని తెలుస్తోంది. మరోవైపు ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మే 3 నుంచి దశల వారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ చేయబోయే ప్రకటన కీలకం కానుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనని కేరళ సిఎం విజయన్‌ ‌లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ప్రధాని మోదీతో అన్ని రాష్టాల్ర సీఎంలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కేరళ సీఎం పినరయి విజయన్‌. ‌పాల్గొనలేదు. ముందస్తుగా తయారు చేసిన నోట్‌ను ఆయన పంపించారు. సీఎం విజయన్‌ ‌స్థానంలో..ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్ ‌సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎక్కువగా ఈశాన్య రాష్టాల్రపై ఫోకస్‌ ‌చేశారని, అందుకే హాజరుకావడం అవసరం లేదని విజయన్‌ అన్నట్లు తెలిసింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!