Take a fresh look at your lifestyle.

అక్రమ ప్లాట్ లను రిజిస్టర్ చేసింది ప్రభుత్వం కాదా..

  • రిటైర్డ్  రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విష్ణ వర్ధన్
  • కాంగ్రెస్ అధికారంలో కి వచ్చాక ఎల్ ఆర్ ఎస్ ను ఉచితం గా చేస్తాం..పీసీసీ చీఫ్ ఉత్తమ్
  • నో ఎల్ ఆర్ఎస్ నో టీఆరెస్ స్లోగన్ తో ప్రజలోకి వెళ్ళాలి ..జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అమానవీయకోనాన్ని వ్యతిరేకించండన్నారు .శుక్రవారం జూమ్ యాప్ ద్వారా రిటైర్డ్  రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విష్ణ వర్ధన్ ,పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ ఎల్ఆర్ఎస్ పై మాట్లాడుతూ …తెలంగాణ లో 80శాతం ఫ్లాట్లు గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్లే అని అక్రమ ఫ్లాట్లను సక్రమం చేయడం మంచిదే కానీ ఉచితం గా చేయండని డిమాండ్ చేశారు.అక్రమ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వం కాదా..అనిప్రభుత్వం చేసిన  తప్పుకు ప్రజలు ఎందుకు జరిమానా కట్టాలని ప్రశ్నించారు.పదవ తరగతి పిల్లావాడికి ఐఎఎస్ పరీక్ష పెట్టినట్లు గా ఎల్ ఆర్ ఎస్ రుసుము ఉందని సామాన్యులకు ఫ్లాట్ రుసుము ఎలా లెక్కట్టాలో అర్థం కానీ పరిస్థితి ఉందని రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా రుసుము లెక్కిస్తే..కొంత మేరా లాభం జరిగేదని అన్నారు .లే అవుట్ చేసిన వారిని , ఫ్లాట్ ను అప్రూవ్ చేసిన వారిని ,రిజిస్ట్రేషన్ చేసిన వారిని శిక్షించకుండ ఫ్లాట్ కొనుగోలు చేసిన వారిని శిక్షించడం ఏంటన్నారు .రిజిస్ట్రేషన్ లు ఆపడం  ముర్ఖపు చర్యగా  తెలిపారు.

80శాతం ఫ్లాట్లు  అక్రమమే అంటూ ప్రభుత్వం చెపుతుంది అంటే ఈ 80 శాతం ప్రజల ను ప్రభుత్వం దొంగలుగా భావిస్తుందా  అని ప్రశ్నించారు .ఇక రాష్ట్ర ఖజానా నింపు కోవడం కోసమే.. ఎల్ ఆర్ ఎస్ తెచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రిజిస్ట్రేషన్ నాటి వాల్యూ ఆధారంగా ఎల్ ఆర్ ఎస్ రుసుము ఉంటుందని సభాముఖంగా మంత్రి చెప్పినా అమలు చేయట్లేదని మండిపడ్డారు .ప్రజల ఆస్తుల వివరాలు గ్రామ పంచాయతీ రికార్డ్ లలో నిక్షిప్తమై ఉన్నాయి మళ్ళీ ఏందుకు సర్వే చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు .పన్నుల భారం మోపేందుకే మళ్ళీ సర్వే లు చేస్తున్నారని న్యాయ స్థానంలో ప్రభుత్వానికి ఏదురు దెబ్బ తప్పదని తెలిపారు .’నో ఎల్ ఆర్ ఎస్ ,నో టిఆర్ఎస్..’స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply