Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడి చేయిదాటి పోయిందా?

  • 24 గంటల్లో 329 కేసు)తో సర్వత్రా ఆందోళన
  • రద్దీ ప్రాంతాలపై ప్రభుత్వానికి లేని నియంత్రణ పట్టించుకోని పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా నియంత్రణ చేయిదాటి పోయిందా ? వైరస్‌ ‌సామూహిక వ్యాప్తి దశకు చేరిందా ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్‌ ‌సడలింపులతో ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడమే కేసుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమా ? రాష్ట్రంలో రోజురోజుకు భారీ స్థాయిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.జీహెచ్‌ఎం‌సీ పరిధిలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 329 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 300 మందికి పైగా కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అందులోనూ గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో 329 కేసులు నమోదు కావడం రాజధాని వాసుల వెన్నులో వెణుకు పుట్టిస్తున్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6 వేలకు పైగా చేరింది. కొరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ఆం‌క్షలలో సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛతో ఈ పరిస్థితి తలెత్తుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కరోజులోనే రాష్ట్రంలో 499 కేసులు నమోదు కావడంతో కొరోనా కట్టడిలో ప్రభుత్వం పట్టు కోల్పోయిందా ? అనే టెన్షన్‌ ‌నెలకొంది. రాష్ట్రంలో పరిస్థితి ఎందుకు చేయి దాటి పోతున్నది ? ప్రజలు సామాజిక భౌతిక దూరం పాటించకపోవ•డం… లేక వైరస్‌ ‌తీవ్రతను తేలిగ్గా తీసుకోవడం కారణాలు అయి ఉండవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చినా, పక్క రాష్ట్రమైన ఏపీతో పోల్చినా తెలంగాణలో నిర్వహిస్తున్న కొరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య అతి తక్కువగా ఉందని అటు ప్రతిపక్షాలు, ఇటు హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైరస్‌ ‌వ్యాప్తి నియంత్రణకు ప్రజలలో దీనిపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. దీంతో రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల 30 నియోజకవర్గాలలో 50 వేల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో రాజధాని, సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైద్య శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న పరీక్షలలో భారీ స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి.

కాగా, రాజధాని హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాలలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడానికి ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నగరంలోని అధిక జనసమ్మర్థ వ్యాపార, వాణిజ్య కేంద్రాలైన బేగంబజార్‌, ‌మలక్‌పేట, చార్మినార్‌ ‌ప్రాంతాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాదిగా ప్రజలు వస్తుంటారు. ఈ ప్రాంతాలలో ఎక్కడా ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదనీ, ఇక్కడికి వచ్చిన వారిలో పాజిటివ్‌ ఉన్న వారి ద్వారా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వైరస్‌ ‌విస్తరిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌, ‌వికారాబాద్‌లలో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు కావడానికి కూడా ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడికే ప్రజలలో ఎక్కువ శాతం మాస్కులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం వంటి ముందు జాగ్రత్తలు పాటించకపోవడం కూడా వైరస్‌ ‌విస్తరించడానికి కారణమవుతోంది. దీనికితోడు లాక్‌డౌన్‌ ఆం‌క్షల సడలింపుల నేపథ్యంలో పోలీసులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా వదిలేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ కేవలం రాత్రి 9 గంటల నుంచి 5 వరకు మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. జూన్‌ 30‌తో లాక్‌డౌన్‌ ‌ముగిసిన తరువాత మరోసారి లాక్‌డౌన్‌ ఉం‌డదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రంలోనూ మరోసారి లాక్‌డౌన్‌ ఉం‌డబోదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమలు ఉన్న సమయంలోనే కేసుల సంఖ్య ఇలా ఉంటే ఇక జూన్‌ 30 ‌తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply