Take a fresh look at your lifestyle.

‘పల్లె ప్రగతి’తో..ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి

‘‘‌హరితహారం’’ హరిత తెలంగాణ లక్షంగా ప్రతి ఊరు ఒక సుందర వనంగా తీర్చిదిద్దుకోవడానికి గ్రామ పంచాయతీలే గ్రామంలో సొంతంగా  నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి  , శాశ్వత ప్రాతిపదికన నర్సరీలతో ఎవరికి ఏ మొక్క కావాలన్న ఇచ్చేదిశగా పండ్లు పూలు నీడ నిచ్చే మొక్కలకు ప్రాధాన్యత కల్పించుకోవాలి ప్రతి సంవత్సరం ఎన్ని వేల మొక్కలు నాటుతామన్న లక్ష్యం కాకుండా ఎన్ని మొక్కలు బతికి ఎదుగుతున్నాయో  తెలుసుకోవాలి ఇంటికో మొక్క ఇవ్వడం కాకుండా వాటిని పూర్తిగా సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి, ఇలా చేసినప్పుడే పచ్చని  గ్రామీణ తెలంగాణ లక్ష్యాన్ని చేరవచ్చు.’’

haritha saram, mehaboob nagar, panchayath, villages, gangadhevipalli

గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముని ఆశయానికి అనుగుణంగా ఆశలు చిగురించేలా తెలంగాణ ప్రభుత్వం రెండవ దశ ‘పల్లె ప్రగతి’కి శ్రీకారం చుట్టడం ఒక శుభ పరిణామం. మొదటి దశలో చేసుకున్న అభివృద్ధిపనులను సమీక్షించుకుని మరింత నూతనంగా 2020లో లక్ష్యాలతో మరిన్ని  పనులను జోడించుకొని ప్రతి గ్రామం ‘‘ఒక గంగదేవిపల్లి’’ని మరిపించాలనే సంకల్పంతో  ప్రజలంతా ప్రేరేపించుకుని అధికారులు ప్రజల సమన్వయం తో గ్రామాల అభివృద్ధికి ప్రతిన పూనుకుంటున్నారు. దీనిని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. మన గ్రామాల పరిస్థితిని ఆత్మావలోకనం చేసుకుంటే 73 యేండ్లపై  స్వతంత్ర భారతంలో పల్లెల  అభివృద్ధి శూన్యం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుంది.  ప్రపంచమంతా అతి వేగంగా సాంకేతిక ఆర్ధిక అభివృద్ధిలో దూసుకుపోతున్నా గ్రామాలూ మాత్రం సరైన మౌలిక సదుపాయాలు లేక జీవం కోల్పోయి, నిర్జీవంగా ఉన్నాయి.
పల్లె ప్రజల జీవనం కడు దయనీయంగా మారింది. వర్షాకాలం వస్తే గ్రామాల్లోకి వరద నీరు చేరి పల్లెలు రోగాల బారిన పడుతున్నాయి. కనీస వనరులైన (త్రాగునీరు, విద్యుత్‌ అం‌తర్గత రోడ్లు డ్రైనేజి పారిశ్యుధ్యం) లేక ప్రజలు వలసలు పోతున్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన రాష్ట్రాల్లో 50 శాతం పైచిలుకు ప్రజలు పట్టణాలకు వలసలు పోతున్నారు. అతిగా పెరిగిన పట్టణ జనాభాకు సౌకర్యాలు లేక, పట్టణ జనాభాతో వేగంగా ఉపాధికి పోటీ పడలేక అర్ధాకలితో అలమటిస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు.

హైద్రాబాద్‌, ‌బెంగుళూరు, ముంబయ్‌, ‌పూణే కలకత్తా, చెన్నై లాంటి నగరాల్లో ఈ వలసల పరంపర ఎక్కువంగా ఉంటుంది. దీనికంతటికి కారణం మన ప్రభుత్వాలు  గ్రామాలను  పట్టించుకోక పోవడమేననడంలో ఎటువంటి  సందేహం లేదు గ్రామాల అభివృద్ధికి ఏనాడూ ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీన్ని అధిగమించాలంటే పల్లెల్లో ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయా . పల్లెలు సుందరంగా తయారు చేస్తే పట్టణ ఛాయలకు పోనీ ప్రజలే ఎక్కువ ఉంటారు. దీన్ని గమనించి తెలంగాణ తొలి ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేసి గ్రామల అభివృద్ధితో కూడిన పథకాలను ప్రారంభించింది. దానిలో భాగంగా 2015 ఆగస్టు 23న ‘పల్లె ప్రగతి’తో కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నా ప్రభుత్వం పల్లెల మహార్దశకు పట్టం కట్టడానికి అనుబంధంగా పనిచేయడంలో భాగమే 2019 సెప్టెంబర్‌ 06 ‌నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో గ్రామీణ వాతావరం మార్పు దిశగా అడుగులు వేసింది మొదటి దశలో గ్రామాలో  నర్సరీ, శ్మశానవాటికి  డంపింగ్‌ ‌యార్డు అంతర్గత రోడ్లుపై శ్రద్ధ చూపి 30 రోజుల్లో గ్రామ ప్రజలు చేయి చేయి  కలిపి ముందుకు సాగి మార్పుకు నాంది  పలికారు. అదే ప్రేరణగా  రెండవ దశ కార్యక్రమంలో పనులను నిరంతరాయంగా చేసుకునే దిశగా  సన్నద్దమయ్యారు.

రెండవ దశ పల్లె ప్రగతి పేరుతో  గ్రామాలూ అద్దంలా మెరిసి పోవాలని ముఖ్యమంత్రి  33 జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి ప్రతిమండలాన్ని గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించుకొని  గ్రామా మొదటి పౌరుడు కార్యనిర్వాహకుడు సహకారంతో గ్రామాల తలరా తను మారుస్తున్న తరుణంలో ప్రతీ పౌరుడు బాధ్యత మెలగాలి పారిశుద్యం.హరిత హారం..విద్యుత్‌  ‌లాంటి పనులను వేగంగా చేసుకోవాలి. గ్రామానికున్న అవసరాలేంటి? ఉన్న వనరులేంటి? అనే విషయాలను బేరీజు వేసుకుని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి ఈ ఏడాది చేయాల్సిన పనులకు సబంధించి వార్షిక ప్రణాళికను, ఐదేళ్లలో చేయాల్సిన పనులకు సంబంధించి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలి.ఈ ప్రణాళికలకు గ్రామసభ నుంచి ఆమోదం తీసుకోవాలి. వాటి అమలుకు కార్యసాధకుల పల్లె ప్రజలంతా ముందుకురావాలి. గ్రామాల్లో ‘పారిశుధ్యం’ లోపించి అపరిశుభ్రతలో గ్రామాల్ల్లో ప్రజలు  రోగాల బారిన పడుతున్నారు. ఇవి నార్మూలించేందకు ప్రతి వ్యక్తి వ్యక్తిగత శుభ్రత పాటించాలి. తమ చుట్టూరా వున్న  డ్రైనేజీలను శుభ్రం చేయాలి. డ్రెయిన్లను రిపేరు చేయాలి. మురికి కాలువల్లో ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగించాలి. అపరిశుభ్ర ప్రాంతాలలో బ్లీచింగ్‌ ‌చల్లటం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాలి. గ్రామస్తులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. సంతలు, మార్కెట్‌ ‌ప్రదేశాలను శుభ్రపరచాలి. ప్రతి ఇంటికి రెండు (తడి, పొడి) చెత్త బుట్టలను  అందించి వాటి వినియోగం గ్రామ పంచాయతీ స్టాండింగ్‌ ‌కమిటీ సభ్యులు తీసుకొని డంపింగ్‌ ‌యార్డుకు పంపించేలా పూనుకోవాలి. అన్ని గ్రామాల్లో డంప్‌ ‌యార్డ్ ఏర్పాటుకు మొదటి దశలో కావల్సిన భూమిని గుర్తించుకున్న గ్రామాలు ఈ దశలో పూర్తి వినియోగంలోకి తీసుకురావాలి. గ్రామ పంచాయతీలలో వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేసుకోవాలి. అలా చేయని వారిపై చర్యలు తీసుకోవాలి. అపుడే అది ఉత్తమ పారిశుధ్య గ్రామంగా నిలబడుతుంది. ఇవన్నీ నిరంతర కార్యక్రమాలుగా చేకుంటేనే ఆదర్శ గ్రామాలుగా నిలబడుతాయే.

‘‘హరితహారం’’ హరిత తెలంగాణ లక్షంగా ప్రతి ఊరు ఒక సుందర వనంగా తీర్చిదిద్దుకోవడానికి గ్రామ పంచాయతీలే గ్రామంలో సొంతంగా  నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి  , శాశ్వత ప్రాతిపదికన నర్సరీలతో ఎవరికి ఏ మొక్క కావాలన్న ఇచ్చేదిశగా పండ్లు పూలు నీడ నిచ్చే మొక్కలకు ప్రాధాన్యత కల్పించుకోవాలి ప్రతి సంవత్సరం ఎన్ని వేల మొక్కలు నాటుతామన్న లక్ష్యం కాకుండా ఎన్ని మొక్కలు బతికి ఎదుగుతున్నాయో  తెలుసుకోవాలి ఇంటికో మొక్క ఇవ్వడం కాకుండా వాటిని పూర్తిగా సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి, ఇలా చేసినప్పుడే పచ్చని  గ్రామీణ తెలంగాణ లక్ష్యాన్ని చేరవచ్చు.  ఇవే కాకుండా తెలంగాణ పల్లెలో విద్యుత్‌ ‌కష్టాలు వేసవిలో వర్ష కాలంలో పరిపాటే వాటిని పవర్‌ ‌వీక్‌ ‌ద్వారా అధిగమించవచ్చు నేటికీ పల్లెల్లో  శ్మశాన వాటికలు లేక రోడ్డుపైన చితులను పేరుస్తూ అవస్థలు పడుతున్నారు ఈ ప్రణాలికల్లో భాగంగా పూర్తిస్థాయిలో స్థలాన్ని చూసుకని నిర్మాణం చేసుకోవాలి . ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలకు ఈ  పథకం ద్వారా పరిష్కారమార్గం చూపవచ్చు. దీనికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఏదో చేస్తున్నామనే భావన లేకుండా ప్రజలతో మమేకమై గ్రామీణ విప్లవానికి చైతన్య స్ఫూర్తిని అందించాలి. పల్లెలో ఆలా చేస్తేనే నిజమైన గ్రామ ప్రగతి సాధిస్తాం తద్వారానే తెలంగాణ గ్రామాలూ దేశంలో ఓకే ఆదర్శ గ్రామాలుగా ప్రతి గ్రామం ఒక గంగాదేవి పల్లెల వికసిస్తుంది.
– వీరంటి ముఖేష్‌,
‌మహబూబాబాబాద్‌  ‌జిల్లా
Tags: haritha saram, mehaboob nagar, panchayath, villages, gangadhevipalli

Leave a Reply