Take a fresh look at your lifestyle.

మంత్రి క్యాంప్‌లో హరితహారం

ఖమ్మం అర్బన్‌, ‌జూన్‌ 25, (‌ప్రజాతంత్ర విలేకరి): ఖమ్మం జిల్లా ఎంబిసి, మైనారీటి కమిటిల ఆధ్వర్యంలో 6వ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌క్యాంపు కార్యాలయంలో 2టౌన్‌ ‌సిఐ తుమ్మా గోపి చేతుల మీదుగా మొక్కలను నాటినట్లు ఆ సంఘ అధ్యక్షులు షేక్‌ ‌సకీనా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎంబిసి అద్యక్షులు, టిఆర్‌ఎస్‌నాయకులు షేక్‌ ‌సకీనాతోపాటు జిల్లా ప్రధానకార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్‌, 32‌వ డివిజన్‌ ‌కార్యదర్శి సుత్రాల శ్రీనివాస్‌, అడ్వకేట్‌ ‌కవిత, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా షేక్‌ ‌సకీనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌మానస పుత్రిక తెలంగాణాకు హరితహారం అని ఉద్యమస్పూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.చెరువుల పునురుద్దరణ వంటి కార్యక్రమాలతో జలవనరుల కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం విరాసిల్లుతోందని అన్నారు. రైతురాజ్యంగా తెలంగాణ తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలన్నారు తెలంగాణాకు హరితహారం 6వ విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు.

Leave a Reply