ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి – పచ్చ బడ్డ పాలమూరు కావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, 25 జూన్( ప్రజాతంత్ర ప్రతినిధి) : యావత్ తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణ మారాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆరవ విడత హరిత హారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పాలమూరు పచ్చ పడే విధంగా మార్పు చెందాలని హబూబ్‌నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటడంతో పాటు, మయూరి అటవీ ప్రాంతంలో కోటి విత్తనాల బాల్స్ లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మంత్రి మహబూబ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఏనుకొండ నుండి ఎదిర వెళ్లే రహదారిలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్తు మైదానంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 62 లక్షల మొక్కలు లక్ష్యం కాగా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగిందని, అంతేకాక మయూరి అర్బన్ ఫారెస్ట్ లో ఎనిమిది వేల ఎకరాలలో కోటి మొక్కలు పెరిగేలా విత్తన బాల్స్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యం, కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు .గతంలో సరైన మొక్కలు లేక వర్షాలు రాక కరువు వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర సంక్షోభాన్ని చవి చూసిందని, గడచిన 6 ఏళ్లలో పరిస్థి తులు మారిపోయాయని, కాలేశ్వరం ప్రాజెక్టు తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని, పాలమూరు-రంగారె డ్డి పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో మొక్కలు పెంచాలని, విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని ,అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు జిల్లాకు కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మయూరిలో కోటి మొక్కల విత్తన బాల్స్, రామచంద్ర మిషన్ ద్వారా అంతరించిపోతున్న మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో పచ్చదనం పెంపొందించేందుకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సహకారంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
హరితహారం పై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రూపొందించిన కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హరిత విప్లవానికి నాంది పలికారని, గడచిన ఆరు సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు .మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యం తో పాటు ఆరోగ్య పరిరక్షణ ఏర్పడుతుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెగ్యులర్‌గా తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా ఈ వాన కాలానికి సంబంధించి రైతుబంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది చెప్పారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చెట్లు పెద్ద సంపద అని అన్నారు. గ్రామాలకు ట్రాక్టర్లు ట్రాలీలు, టాంకర్లు వచ్చిన తర్వాత మొక్కలు బ్రతికే శాతం పెరిగిందని, అంతేకాక హరితహారం పట్ల ప్రజల్లో అవగాహ న వచ్చిందన్నారు . పుట్టినరోజులు, ముఖ్యమైన రోజులలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఏస్.వెంకట రావు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం లో గడచిన ఐదు సంవత్సరాలలో నాలుగు కోట్ల పైగా మొక్కలు నాటడం జరిగిందని, అయితే గత రెండేళ్ల నుండి నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ చేయించామని తెలిపారు .ఈ సంవత్సరము కోటి మొక్కలు నాటేందుకు లక్షయంగా నిర్ణ యించామని చెప్పారు. 138 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మొక్కలు నాటడం తో పాటు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు .కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తో పాటు మున్సిపల్ పాఠశాలల్లో కూడా మొక్కలు నాటాలని చెప్పారు . జిల్లా ఎస్ పి రేమా రాజేశ్వరి మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా జిల్లాలో రౌడీ షీటర్లుగా ఉన్న వారి ద్వారా పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన వారికి ఒక ఏరియాను దత్తత ఇస్తున్నామని, 2016 నుండి జిల్లాలో ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన యువకులు, ఇతరుల తో కూడా మొక్కలు నాటిస్తున్నామని చెప్పారు. పోలీస్ శాఖ ద్వారా ఈ సంవత్సరం లక్ష మొక్కలు లక్ష్యంగా వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్ ,డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ,డిసిఎంఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ,గ్రంథాలయ అధ్యక్ష్యులు రాజేశ్వర్ గౌడ్,అదనపు కలెక్టర్ మోహన్‌లాల్ ,ఆర్డీవో శ్రీనివాసులు,జెడ్ పి సి ఈవో యాదయ్య,డీఈవో గోవింద రాజులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.