Take a fresh look at your lifestyle.

ఫలించని హరీష్‌రావు కృషి…

రామలింగారెడ్డిని బతికించడానికి సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. గత 20 రోజుల కిందట కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ఆయన శస్త్ర చికిత్స చేయించుకోగా, అది వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వారం రోజుల క్రితం గచ్చిబోలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఏఐజిలో చేరిన రామలింగారెడ్డిని రక్షించడానికి మంత్రి హరీష్‌రావు ప్రతి నిత్యం ఆసుపత్రికి వెళ్లడం..సంబంధిత వైద్యులతో మాట్లాడటం…రామలింగారెడ్డికి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. రామలింగారెడ్డిని రక్షించడానికి సిఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌కూడా ప్రయత్నించినప్పటికీ…ఫలితం లేకుండా పోయింది. వెంకిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతూ రామలింగారెడ్డి గురువారం రాత్రి 2.30గంటల ప్రాంతంలో తుది శ్వాస వదిలారన్నారు.

జర్నలిస్టులు ఎలా ఉద్యమించాలో చూపిన నిఖార్సయిన ఆర్‌ఎల్‌ఆర్‌..
‌స్నేహశీలి, జర్నలిస్టులు కూడా సమాజంలో ఒక భాగమని జర్నలిస్టుల సమస్యలపైనే కాకుండా ప్రజాసమస్యలపై జర్నలిస్టులు ఎలా ఉద్యమించాలో చూపిన నిఖార్సయిన ఉద్యమ బిడ్డ సోలిపేట రామలింగారెడ్డి(ఆర్‌ఎల్‌ఆర్‌). ఆయన లేడన్న చేదు నిజాన్ని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పాత్రికేయుడిగా వర్కింగ్‌ ‌జర్నలిస్టుల హక్కుల సాధనకై నాటి ఏపీయూడబ్ల్యుజెలో మెదక్‌ ‌జిల్లా అధ్యక్షుడిగా అవిశ్రాంతంగా పోరాడారు. భారత దేశంలోనే ప్రప్రథమంగా ఓ పాత్రికేయుడిపై టాడా కేసు నమోదవ్వడం..అది రామలింగారెడ్డిపైనే కావడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైన అంశం. పోలీసుల నుండి తన ప్రాణానికి ముప్పు పొంచివుంటుందని తెలిసినా… ఏనాడు ఉద్యమాల నుండి వెనకంజ వేయని సాహస వీరుడు ఆయన. చావుకు తాను భయపడనని, దానికి ఎప్పుడైనా సిద్ధమేనంటూ ఆ రోజుల్లో పలు సందర్భాల్లో రాజ్యానికి సవాల్‌ ‌విసిరిన ప్రజా ఉద్యమకారుడాయన. ఒక్కమాటలో చెప్పాలంటే ముక్కుసూటితనం ఆయన నైజం. ప్రజల్లో ఆయనకున్న పేరు ప్రతిష్టలు, ధైర్య సాహసాల పట్ల ముగ్దులయ్యి.. కేసీఆర్‌ ఆయనను తెలంగాణ ఉద్యమంలోకిలాగి శాసనసభ ఎన్నికల్లో అప్పటి దొమ్మాట(ప్రస్తుత దుబ్బాక) నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్‌ ‌నుండి బరిలో దింపారు.

మెతుకు సీమ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర రామలింగారెడ్డిది: విరాహత్‌ అలీ
వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం మాజీ నాయకుడు, పేద ప్రజల పక్షపాతి, దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఇక లేరనే నమ్మశక్యం లేని నిజాన్ని తెలుపడానికి చింతిస్తున్నాననీ వర్కింగ్‌ ‌జర్నలిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్‌ అలీ అన్నారు. తన కాలుకు రక్త ప్రసరణలో చిన్న ఇబ్బంది ఏర్పడడంతో దాదాపు 20 రోజుల క్రితం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి ఆయన శస్త్ర చికిత్స చేయించుకోగా, అది వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వారం రోజుల క్రితం గచ్చిబోలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వెంకిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న ఆర్‌ఎల్‌ఆర్‌ ‌గురువారం రాత్రి 2.30గంటల ప్రాంతంలో తుది శ్వాస వదిలారన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి మెతుకుసీమ ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన గొప్ప చరిత్ర రామలింగారెడ్డిదన్నారు. ఆయన ఆకస్మికమృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యుజె) పక్షానా ప్రఘాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నాననీ విరాహత్‌ అలీ పేర్కొన్నారు.

ఇదీ…రామలింగారెడ్డి నేపథ్యం…
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఓ భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రామలింగారెడ్డి… 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రామలింగారెడ్డి. రాజకీయ నేతగా చరిత్ర ప్రారంభించకముందు… సుమారు 25 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. 2004లో సీఎం కేసీఆర్‌ ‌దృష్టిలో పడ్డారు. ‘‘ఏవయ్యా… జర్నలిస్టులంటే నాకు చాలా గౌరవం. నీ పనితీరు నచ్చింది. రాజకీయాలలోకి రారాదూ’’ అని కేసీఆర్‌ ఆఫర్‌ ఇవ్వడంతో… రామలింగారెడ్డి ఆలోచనలో పడ్డారు. ఓ జర్నలిస్టుగా కంటే… రాజకీయ నేతగా అయితే మరింత ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం వస్తుంది కదా అని అనుకున్నారు. అంతే… అక్కడి నుంచి ఆయన పయనం రాజకీయాలవైపు సాగింది.చదువుకునే రోజుల్లోనే ర్యాడికల్‌ ‌విద్యార్థి సంఘంలో పని చేసిన ఆయన పౌర హక్కులు సంఘములో కూడా పని చేశారు. తర్వాతి రోజుల్లో మావోయిజం వైపు ఆకర్షితులు అయి మావోయిస్టుగా మారిన ఆయన కొన్నాళ్ళు దళంలో కూడా పని చేశారు. తరువాత బయటకు వచ్చి జర్నలిస్ట్ ‌గా మారారు ఆయన. 2001 లో జర్నలిస్ట్‌గా పనిచేస్తూ టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు రామ లింగా రెడ్డి. 1985లో రామలింగారెడ్డి వివాహానికి హాజరు అయ్యారు కేసీఆర్‌. అలా 2004, 2008 ఉప ఎన్నికల లో దొమ్మాట నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజక వర్గ పునర్విభజనలో భాగంగా గా దుబ్బాకగా దొమ్మాట మారింది. 2009లో మహా కూటమి అభ్యర్థిగా దుబ్బాక నుంచి పోటీ చేసి అప్పటి వరుకు టీడీపీలో ఉండి సీట్‌ ‌రాకపోవడంతో కాంగ్రెస్‌ ‌లోకి వెళ్ళిన చెరుకు ముత్యంరెడ్డి చేతిలో ఓటమి అయ్యారు. 2014, 2018 ఎన్నికల లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన సోలిపేట మీద వందలాది కేసులు ఉండేవి. రెండోసారి శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ ‌గా వ్యవహరిస్తున్నారు రామలింగారెడ్డి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!