Take a fresh look at your lifestyle.

కోటి 50 లక్షల మొక్కలు నాటుదాం మంత్రి హరీష్‌రావు

హరిత హారం కార్యక్రమం అంటే రాష్టానికే ఆదర్శంగా ఉన్న సిద్ధిపేట జిల్లాలో ఈ యేటా కూడా కోటి 50 లక్షల మొక్కలు నాటుద్దాం జిల్లాను ముందంజలో ఉంచుదామని మంత్రి హరీష్‌రావు అధికారులకు నిర్దేశం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో 2020-21 హరిత హారం యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌పై జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు హరిత హారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా జెడ్పీ చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, చీఫ్‌ ‌విప్‌-ఎమ్మెల్సీ బీ.వెంకటేశ్వర్లు, దుబ్బాక, జనగామ, హుస్నాబాద్‌ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఒడితెల సతీశ్‌, ఎఫ్డీసీ చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్లు పద్మాకర్‌, ‌ముజంమీల్‌ ‌ఖాన్‌, ‌డీఎఫ్‌ఓ ‌శ్రీధర్‌, ‌డీఆర్డీఏ పీడీ గోపాల్‌ ‌రావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఏంపీడీఓలు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ..అన్నీ గ్రామాల్లోని నర్సరీల్లో జూన్‌ ‌మొదటి వారంలోపు హరిత హారంలో నాటే మొక్కలు సిద్ధం చేయడంతో పాటు., అన్నీ నర్సరీల్లో కలుపు మొక్కలు తీసేసి క్రమపద్ధతిలో అమర్చేలా ప్రాంతాల వారీగా విభజించాలని ఏంపీడీఓ, మండల ప్రత్యేక అధికారులకు మంత్రి ఆదేశించారు. గ్రామ సర్పంచ్‌ ‌సమన్వయంతో పంచాయతీ కార్యదర్శి, టెక్నీకల్‌ అసిస్టెంట్స్ ‌వారీ గ్రామాల్లో నర్సరీలు సందర్శించి, అందుబాటులో ఉన్న మొక్కలను సరి చూసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఎప్పటికప్పుడు ఏంపీడీఓ, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల వారీగా మొక్కలు నాటాల్సిన ప్రదేశాల్లో గుంతలు తవ్వి, ఆయా ప్రాంతాల వారీగా ఆన్‌ ‌లైనులో నమోదు చేయాలన్నారు, ఏవైనా సాంకేతిక సలహాల కోసం అటవీ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. టీజీఎఫ్‌ఎంఐఎస్‌ ‌సైట్‌ ‌లో ప్రతి వారం, వారం గతంలో నాటిన మొక్కల స్థితిగతులను నమోదు చేయాలన్నారు. అదే విధంగా రోజూ వారీగా మొక్కలు నాటే అంశాలను, వివరాలను టీజీఎఫ్‌ఎంఐఎస్‌ ‌సైట్‌ ‌లో నమోదు చేయాలన్నారు.

Leave a Reply