మెదక్ జిల్లా చేగుంటలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాల సముదాయాన్ని మంత్రి హరీష్ రావు సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్ పి ఛైర్మెన్ హేమలత శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..
“ఇందాకే కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టి ఇక్కడకు వచ్చాను. వచ్చే ఏడాదిలో ప్రభుత్వం మీకు ఏ రకంగా సేవ చేస్తుంది అనేది చెప్పాము..ఈ సారి బడ్జెట్ లో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారి కోసం రు. 3 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించాము. ఈ యేడాది నియోజక వర్గానికి 3000 ఇళ్లు, వచ్చే యేడాది 3000 ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం..అని తెలిపారు.
57 దాటితేనే పింఛన్లు ఇస్తామని వివరిస్తూ..
రాష్ట్రంలో 38లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాము.. వచ్చే ఉగాది తర్వాత కొత్త పింఛన్ల మంజూరు చేయాలని ప్రతిపదించాము…బాలింతల్లో రక్త హీనత సమస్య నివారించేందుకు కేసీఆర్ న్యుట్రిషన్ కిట్ ను పంపిణీ చేయాలని ప్రతిపాదిచాము..ప్రజల ఆకాంక్షల గీటు రాయిగా ప్రభుత్వం పని చేస్తున్నది. .మేము ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే ఢిల్లీలోని ప్రభుత్వం రైతుల ఉసురు ఊసుకుంటున్నది. .యూపీ ఎన్నికలు కాగానే మళ్ళీ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారట.. జుటా మాటల బీజెపి వ్యవహారాన్ని అందరూ అర్థం చేసుకోవాలి..అన్నం పెట్టే చేయి ఏదో.. సున్నం పెట్టే చేయి ఏదో ప్రజలు గుర్తించాలి. సున్నం పెట్టే చేతులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి.. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.