రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొండ పోచమ్మ సాగర్ జల పండుగను విజయవంతం చేసిన జిల్లా అధికారిక వర్గాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీ రావు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్తో కొండ పోచమ్మ సాగరులోకి నీటి విడుదల సందర్భంగా నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేసిన రెవెన్యూ, ట్రాన్స్ కో, పోలీస్, ఇరిగేషన్, ఇంజనీరింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డివిజన్, మండలాల పాత్రికేయులకు పేరు పేరునా మంత్రి హరీష్రావు కృతజ్ఞతలు తెలిపారు.