Take a fresh look at your lifestyle.

మానవత్వం బతికే ఉంది…

  • అందుకు మంత్రి హరీష్‌రావే నిదర్శనం
  • ఇటిక్యాల అనాధ పిల్లలకు హరీష్‌రావు భరోసా
  • బియ్యం, ఆర్థిక సహాయం అందజేత
  • అమ్మానాన్న లేని పిల్లల బాధ్యత తీసుకుంటానన్న హరీష్‌రావు

సిద్ధిపేట, మే 27 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని ఇటిక్యాలకు చెందిన కడారి గణేష్‌, అక్షయ, లక్ష్మీ గత కొంత కాలం కిందట తండ్రి కనకయ్యను కోల్పోయారు. తాజాగా తల్లి ఐలమ్మను కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయి ఈ ముగ్గురు పిల్లలు అనాధలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు ప్లిలు అనాధలుగా మారారన్న వార్త ఎందరినో కదిలించింది. ఈ ముగ్గురు అనాధ పిల్లలను చూసి చాలా మంది చలించిపోతున్నారు. వీరికి ఒకరిద్దరు బియ్యం అందజేశారు. అయితే, ఈ ముగ్గురు అనాధ పిల్లలకు ఏమాత్రం ముక్కు, ముఖం ఎరగని, పరిచయం లేని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తాను భరోసాగా ఉంటానంటూ బియ్యం, ఆర్థిక సహాయం పంపించారు. నేనున్నాననీ భరోసా ఇచ్చారు. తమకు పంపిన వారెవరో కూడా ఈ ముగ్గురు అనాధ పిల్లలకు తెలియదు. కానీ, మానవత్వం ఇంకా మిగిలే ఉందన్న విషయం మాత్రం మరోసారి నిరూపితమైంది. వివరాల్లోకి వెళ్లితే…ఇటిక్యాలకు చెందిన కడారి కనకయ్య-ఐలమ్మ ఇద్దరూ మృతి చెందారు. దీంతో వారి ముగ్గురు పిల్లలైన గణేష్‌, అక్షయ, లక్ష్మీ అనాధలయ్యారు. ఈ విషయాన్ని ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గూండా రంగారెడ్డి ఫోన్‌ ‌ద్వారా మంత్రి హరీష్‌రావుకు తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి హరీష్‌రావు గజ్వేల్‌ ‌ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి(గడా)తో పాటు స్థానికంగా ఉండే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, గ్రామ సర్పంచిని హుటాహుటిన ఇటిక్యాలకు వెళ్లాలనీ ఆదేశించారు.

మంత్రి ఆదేశాతో గడా ప్రత్యేకాధికారి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు హుటాహుటిన గురువారం ఇటికాల్యకు వెళ్లారు. గ్రామానికి వెళ్లిన గడా ప్రత్యేకాధికారి, ప్రజాప్రతినిధులు అమ్మానాన్న లేని అనాధ పిల్లలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామనీ మంత్రి హరీష్‌రావు తరుపునగడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆత్మకకమిటీ ఛైర్మన్‌ ‌రంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ …తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు స్పందించారని చెప్పారు. మంత్రి అదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. పిల్లల భవిష్యత్‌ ‌లక్ష్యంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. జగదేవ్‌పూర్‌లో నూతనంగా నిర్మాణం జరగనున్న డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లలో ఈ అనాధ పిల్లలకు ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, అలాగే పిల్లలను ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ ‌హబ్‌లో చేర్పిస్తామని తెలిపారు. ఇద్దరు ఆడ పిల్లల భవిష్యత్‌ ‌కోసం వారి పేరు మీద డిపాజిట్‌ ‌చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్వయంగా తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచి రవికంటి చంద్రశేఖర్‌ను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు

. తక్షణ సహాయం కింది మంత్రి తరపున 10వేల రూపాయలు అందించారు. ఇటీవల అనాధ పిల్లల తల్లి ఐలమ్మ అనారోగ్యానికి గురైన సందర్భంగా దవాఖానలో ఖర్చయిన డబ్బులను సిఎంఆర్‌ఎఫ్‌ ‌ద్వారా ఇప్పించడంతో పాటు అప్పులకు సంబంధించిన వివరాలపై కూడా గడా అధికారిని మంత్రి హరీష్‌రావు నివేదిక కోరినట్లు ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గుండా రంగారెడ్డి తెలిపారు. అప్పులను పరిష్కరించే మార్గాన్ని మంత్రి హరీష్‌రావు చూడనున్నట్లు రంగారెడ్డి తెలిపారు. అనాధ పిల్లలను పరామర్శించిన వారిలో ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గూండా రంగారెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకుడు మదాసు శ్రీనివాస్‌, ఎం‌పిపి బాలేషంగౌడ్‌, ‌కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్‌ ‌రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, పిఏసిఎస్‌ ‌ఛైర్మన్‌ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌, ‌జగదేవ్‌పూర్‌ ఎం‌పిటిసి కొత్త కవిత శ్రీనివాస్‌రెడి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్‌గౌడ్‌, ‌నేతలు ఎక్బాల్‌, ‌కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply