Take a fresh look at your lifestyle.

అభివృద్ధి,సంక్షేమం,వ్యవసాయం ..హరీష్‌ ‌పద్దుల ప్రాధాన్యం ..!

  • రైతుబంధుకు రూ. 14, 800 కోట్లు …రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు..
  • రైతుబీమా కోసం రూ. 1200 కోట్లు ..పశుసంవర్ధక శాఖకు 1730 కోట్లు,
  • సాగునీటి రంగానికి 16,931 కోట్లు.. సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు
  • వ్యవసాయానికి రూ. 25వేల కోట్లు కేటాయింపు
  • కొరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందన్న మంత్రి
  • 2021-22 సంవత్సరానికి బడ్జెట్‌ ‌విలువ రూ. 2,30,825.96 కోట్లు.
  • రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు గా అంచనా
  • మూలధన వ్యయం రూ. 29.046.77 కోట్లుగా అంచనా
  • సీఎం దళిత్‌ ఎం‌పవర్‌మెంట్‌కు రూ. వెయ్యి కోట్లు..
  • కొత్త సచివాలయ నిర్మాణానికి 610 కోట్లు…
  • నగర మంచినీటి పథకానికి 250 కోట్లు
  • బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు కృతజ్ఞతలు

అభివృద్ది,సంక్షేమంతో పాటు తెలంగాణ ఆకాంక్షలు లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ ‌నాయకత్వంలో ముందుకు పోతున్నామని ఆర్థికమంత్రి హరీష్‌ ‌రావు ప్రకటించారు. గ్రామాలను తీర్చిదిద్దడం, పేదలను ఆదుకోవడం, అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మంత్రి హరీష్‌ ‌రావు తన బడ్జెట్‌ ‌ప్రసంగంలో పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ బడ్జెట్‌ ‌విలువ రూ. 2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా.. ఆర్థిక లోటు అంచనా రూ. 45, 509.60 కోట్లు, మూలధన వ్యయం రూ. 29.046.77 కోట్లు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని..ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని.. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతి పథాన పయనిస్తున్నామని..కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిందని హరీష్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్‌ ‌ప్రసంగం అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు. కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

బడ్జెట్‌లో జీఎస్‌డీపీ అంచనా రూ.9,78,373 కోట్లుగాను, తలసరి ఆదాయం అంచనా రూ.2,27,145 కోట్లుగాను మంత్రి అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. ఆ రంగానికి దాదాపు రూ. 25వేల కోట్లు కేటాయించింది. రైతు బంధు కోసం రూ. 14, 800 కోట్లు కేటాయించగా.. రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు.. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించింది. •తు రుణమాఫీ కోసం 5,225 కోట్లు,శుసంవర్ధక శాఖకు 1730 కోట్లు, సాగునీటి రంగానికి 16,931 కోట్లు, సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు కేటాయించి వ్యవసాయ రంగంపై శ్రద్దను మరోమారు చాటుకున్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్‌ ఉం‌టుందని ఆయన ఆకాంక్షించారు.

ఇందులో సీఎం దళిత్‌ ఎం‌పవర్‌మెంట్‌కు రూ. వెయ్యి కోట్లు.. మూసీ సుందరీకరణకు రూ.200 కోట్లు.. హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరాకు రూ.250 కోట్లు.. ఎయిర్‌స్ట్రి ‌నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించారు. మెట్రో రైలు కోసం రూ. 1000 కోట్లు.. పురపాలక, పట్టణాభి వృద్ధి అభివృద్ధి కోసం రూ.15, 030 కోట్లు ప్రకటించారు.

harish rao speech at assembly

వైద్య ఆరోగ్య శాఖ కోసం రూ.6295 కోట్లు, పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు.. ఉన్నత విద్య కోసం రూ.1873 కోట్లు.. రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం ప్రకటించారు. విద్యుత్‌ ‌రంగానికి 11, 046 కోట్లు.. పరిశ్రమ శాఖ కు రూ.3077 కోట్లు..ఐటీ రంగానికి రూ. 360 కోట్లు, దేవాదాయ శాఖకు రూ. 720 కోట్లు.. హోమ్‌ ‌శాఖకు రూ.6465 కోట్లు, ఆర్‌ అం‌డ్‌ ‌బీ కి రూ. 8,788 కోట్లు.. రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు భూ సేకరణ కోసం రూ.750 కోట్లు, పౌర సరఫరాల శాఖకు రూ.2, 363 కోట్లు కేటాయింపులు చేశారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు..బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు.. గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు.. సాంస్కృతిక పర్యాటక రంగానికి 726 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1502 కోట్లు.. మైనార్టీల సంక్షేమానికి రూ.1606 కోట్లు, డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లు కేటాయించారు. పంచాయతీ గ్రావి•ణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు, సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ‌పథకాలకు రూ.2,750 కోట్లు కేటాయింపులన ప్రకటించారు.

Harish Rao thanks CM KCR for giving him the opportunity to introduce the budget

రీజనల్‌ ‌రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.. నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు.. పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు, దేవాదాయశాఖకు రూ.720 కోట్లు.. అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.. ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు చేశారు. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు…పంచాయతీ రాజ్‌, ‌గ్రావి•ణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు కేటాయించారు.

ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు కేటాయించారు. కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌కోసం 725 కోట్లు కేటాయించారు. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్లు,ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లురైతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు,

kcr at assembly budget

పోలీసు స్టేషన్‌ ‌లలో షి టాయిలెట్ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు, యూనివర్సిటీలలో షి టాయిలెట్స్ ‌నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించారు. మహి ళా,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు, పట్టణాల్లో వైకుంఠధామం నిర్మాణం కోసం 200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌ ‌తాగునీటి అవసరాల కోసం సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు కేటాయించారు.

Leave a Reply