జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న డ్రైవింగ్ స్కూల్‌పై మంత్రి హరీశ్ రావు ఆర్టీసీ అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. ఇప్పటికే 70 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించామని త్వరలోనే వారిని ఎంపిక చేసి డ్రైవింగ్‌లో శిక్షణ ప్రారంభిస్తామని ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. వారికి డ్రైవింగ్‌తో పాటు, లైసెన్స్ లు ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, దేవదాయశాఖ ఈవో మోహన్ రెడ్డి, దేవాలయ పాలకమండలి ఛైర్మన్ నీలా వెంకటేశం, సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్ పాటిల్, దేవాలయ ట్రస్టీ ప్రభు గుప్తా, మున్సిపల్, ఆర్ డబ్ల్యూ.ఎస్, ఆర్టీసీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.