Take a fresh look at your lifestyle.

నేను హరీష్ రావును ..నా నంబర్ 9866199999

  • ఏ ఆపదొచ్చినా ఫోన్ చేయండి 
  • మీరు మా బిడ్డలే మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా.! 
  • పొన్నాలలో 80 మంది వలస కార్మికులకు 12కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందజేత 
  • మనోహరబాద్, పొన్నాలలో వలస కూలీలకు హరీష్ రావు కొండత అండ

లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు పరిచయం అక్కర్లేని ఫోన్ నెంబరు, కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేగా సిద్ధిపేట సుపరిచితుడు, ఆపదోస్తే చాలు వెంటనే స్పందించే ఫోన్ నెంబరు 9866199999. ఇప్పుడు ఇదే ఫోన్ నెంబరు వలస కూలీలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నది. ఆపదోస్తే.. తనకు ఫోన్ చేయాలని, మా బిడ్డలుగా మిమ్మల్ని ఆదుకుంటామని వలస కూలీలకు కొండంత అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. పొట్ట చేత పట్టుకుని కూలీ చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులైన వలస కూలీల సేవలు అనిర్వచనీయమని మంత్రి కొనియాడారు. మెదక్ జిల్లా మనోహరబాద్ వలస కూలీలకు, జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ శివారు పొన్నాలలో విల్లాస్ నిర్మిస్తున్న 80 మంది వలస కార్మికులకు 12కిలోల బియ్యం, 500 రూపాయల నగదును శుక్రవారం సాయంత్రం మంత్రి హరీశ్ రావు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట పట్టణంలో ఇప్పటి దాకా 4 వేలకు పైగా వలస కార్మికులకు, వివిధ రంగాలలో పని చేసే కార్మికులను ఆదుకున్నామని మంత్రి పేర్కొన్నారు. లాక్ డౌన్ ఇంకా కొన్ని రోజులు పెరిగినా.. మీరంతా మాకు సహకరించాలని, మీ పిల్లలను బయటకు పంపొద్దని కోరారు. పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయామని, మీరేం రంది పడొద్దని., మీరు మా బంధువులేనని, హమ్ సబ్ హిందూస్థానీ అంటూ.. వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే.. ఉచిత భోజన సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని నిరభ్యంతరంగా తినొచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, గ్రామ సర్పంచ్ తన్నీరు శ్రీనివాస్, బాల్ రంగం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply