రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన మాసపక రాజు తలకు తీవ్రంగా గాయలై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరారు. రాజు పరిస్థితిని జగదేవ్‌పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గూండా రంగారెడ్డి మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లార. తక్షణమే స్పందించిన మంత్రి హరీష్‌రావు..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2లక్షల రూపాయల ఎల్వోసి(లెటర్ ఆఫ్ క్రెడిట్)ను తెప్పించారు.
ఈ మేరకు శుక్రవారం జగదేవ్‌పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకుడు గూండా రంగారెడ్డికి అందజేశారు. రాజు ఆర్థిక పరిస్థితిని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని చెప్పగానే స్పందించి ప్రభుత్వం తరపున 2లక్షల రూపాయల ఎల్వోసిని తెప్పించి అందజేసిన మంత్రి హరీష్‌రావుకు రాజు కుటుంబ సభ్యులను, తన వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి వెంట టిఆర్ఎస్ జిల్లా యూత్ నాయకుడు ఆలేటి సంతోష్ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే,ప్రభుత్వం నుంచి మంజూరైన 2లక్షల రూపాయల ఎల్వోసిని టిఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి, సంతోష్‌రెడ్డి…ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజుకు అందించారు.