Take a fresh look at your lifestyle.

కొరోనా బాధిత జర్నలిస్ట్‌కు బాసట

యశోదాలో చేర్పించిన మంత్రి హరీష్‌రావు

 కొరోనాతో బాధపడుతున్న సీనియర్‌ ‌జర్నలిస్ట్‌కి మంత్రి హరీష్‌రావు అండగా నిలిచారు. ఈ మేరకు  తెలంగాణ జర్నలిస్ట్ ‌జెఏసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. కొరోనా వ్యాధితో బాధపడుతున్న సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌సిద్దిరెడ్డి శ్రీనివాస్‌ ‌రెడ్డికి అండగా నిలిచిన మంత్రి హరీశ్‌ ‌రావు  అతడిని సికింద్రాబాద్‌ ‌యశోదా ఆస్పత్రికి తరలించేలా చేశారు. శ్రీనివాసరెడ్డి సెల్ఫీ వీడియో ద్వారా తను కొరోనాతో పడుతున్న బాధలను మంత్రి హరీష్‌ ‌రావుకు చేరవేశారు. వెంటనే స్పందిందించన మంత్రి మెరుగైన వైద్యం కోసం యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.
ఇప్పుడు శ్రీనివాస రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. సకాలంలో స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావుకు తెలంగాణ జర్నలిస్ట్ ‌జాక్‌ ‌రాష్ట్ర కన్వీనర్‌ ‌దేవరకొండ కాళిదాస్‌, ‌కో కన్వీనర్‌ అవ్వారు రఘులు కృతజ్ఞతలు తెలిపారు. కొరోనాతో బాధపడుతున్న సీనియర్‌ ‌జర్నలిస్ట్ శ్రీ‌నివాస్‌ను యశోద ఆస్పత్రిలో మంగళవారం రాత్రీ మంత్రి హారీష్‌ ‌రావు చేర్పించారు. ఇబ్బందిగా ఉంది..అపోలోలో జాయిన్‌ ‌చేయించమన్న శ్రీనివాస్‌ ‌విన్నపానికి స్పందించి, వెంటనే సికింద్రాబాద్‌ ‌యశోద ఆస్పత్రిలో చేర్పించిన మంత్రి అన్ని విధాలుగా అండగా ఉంటానని హా ఇచ్చారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

Leave a Reply

error: Content is protected !!