హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం మల్కాజిగిరిలోని బ్రహ్మకుమారీస్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి బ్రహ్మకుమారీలు ధ్యాన పక్రియ ప్రాశస్త్యాన్ని వివరించారు.
ధ్యాన కేంద్రంలో ఉన్న చిత్ర పటాలు చూపిస్తూ వాటి అర్థాన్ని ఆయనకుతెలిపారు. అనంతరం బ్రహ్మకుమారీస్ జెండాను రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక నేతలు హాజరయ్యారు.