- విఠలాపూర్ గ్రామ యువతకు మంత్రి హరీష్ రావు హితవు
- గోదాముకు రూ.5 కోట్లు, కుంట కట్ట బలోపేతానికి మరమ్మత్తుకు రూ.1.38 కోట్లు నిధులు మంజూరు
దించిన తల ఎత్తకుండా చదివి ప్రయోజకులు కావాలని .. లేదంటే.. బాపుతో బావి దగ్గర వ్యవసాయ పనుల్లో చేదోడు గా ఉండాలని ఆర్ధిక మంత్రి హరీష్ రావు విద్యార్థులకు హితవు పలికారు. మీ కాళ్లకు మట్టి అంటకుండా గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం నా బాధ్యత నేను చేయిస్తానని., కానీ గ్రామ యువత బాగా చదివి.. మంచి ఉద్యోగం పొందాలని, లేదంటే.. అమ్మ, బాపుతో కలిసి బాయికాడికొచ్చి కమర్షియల్ క్రాప్స్ పండించి మంచి లాభాలు గడించాలని గ్రామ యువతను మంత్రి హరీశ్ రావు కోరారు .
