Take a fresh look at your lifestyle.

కాలువలు, పిల్ల కాల్వల అసంపూర్తి పనులన్నీ .. త్వరగా పూర్తి చేయాలి

  • మల్లన్నసాగర్‌ను సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యే
  •  సిద్ధిపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో కాల్వలు, పిల్ల కాల్వల భూ సేకరణ ప్రక్రియపై ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
  •  మల్లన్న, రంగనాయక, తపాస్‌ ‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు..వాటి కాల్వలు, పిల్ల కాల్వలు, ఆయకట్టు కింద వచ్చే చెరువులు, కుంటలపై ఇరిగేషన్‌ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష 

స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి వనరులకై ఇంజనీర్‌ ఆలోచన చేయాలి. అప్పుడే ఆ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా నీటి వనరులు లభిస్తాయని, ఆ దిశగా ఇరిగేషన్‌ అధికారులు పని చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు సూచించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్‌ ‌మండలంలోని చందలాపూర్‌ ‌రంగనాయక సాగర్‌ ఇరిగేషన్‌ ‌కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఇరిగేషన్‌ అధికారులతో జిల్లాలోని మల్లనసాగర్‌, ‌తపాస్‌ ‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాల్వలు, పిల్ల కాల్వలపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రధానంగా సిద్ధిపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో కాల్వలు, పిల్ల కాల్వల భూ సేకరణ ప్రక్రియపై ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాల్వల ద్వారా ఎత్తుగా ఉండే ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా లిఫ్టు అంశంపై అధికారులతో చర్చించారు. మల్లన్న సాగర్‌, ‌రంగనాయక సాగర్‌, ‌తపాస్‌ ‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు.. వాటి కాల్వలు, పిల్ల కాల్వలు, ఆయకట్టు కింద వచ్చే చెరువులు, కుంటలపై అధికారులతో సుదీర్ఘ సమీక్షించారు. కాలువలకు అడ్డంగా వచ్చే రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణం తదితర విషయాల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. పిల్ల కాల్వలకు చేపట్టిన, చేపట్టాల్సిన అసంపూర్తి పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కాలువలకు పలుచోట్ల మిగిలి పోయిన, నీటి మల్లింపునకు ఇతరచోట్ల కావాల్సిన, వీలుగా అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని ఇరిగేషన్‌ ఇం‌జనీర్లను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌, ఎస్‌ఈ ఆనంద్‌, ‌తపాస్‌ ‌పల్లి ఎస్‌ఈ ‌సుధాకర్‌ ‌రెడ్డి, డిప్యూటీ ఈఈ రవీందర్‌ ‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారిక సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న సాగర్‌ ‌ను సందర్శించిన మంత్రి ఎమ్మెల్యే
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ ‌గ్రామ సొరంగం-టన్నెల్‌ ‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 మల్లన్న సాగర్‌ ‌పంప్‌ ‌హౌస్‌ ‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సందర్శించారు.దుబ్బాక నియోజక వర్గానికి ప్రధాన కాలువ ద్వారా నీళ్లు అందించే పంప్‌ ‌హౌస్‌ ‌దారి పనులను ఇరిగేషన్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మంత్రి హరీశ్‌, ‌దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.ఫీడర్‌ ‌ఛానల్‌ ‌నుంచి మల్లన్న సాగర్‌ ‌ప్రధాన కాలువకు చేపట్టాల్సిన ఓటీ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు మంత్రి హరీశ్‌ ‌రావు ఆదేశించారు. దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగర్‌ ‌ద్వారా గోదావరి జలాలు రాబోతున్నాయి. మల్లన్న సాగర్‌ ‌తో మొత్తం లక్ష 25 వేల ఏకరాలకు సాగునీరు వస్తుంది.సీఏం కేసీఆర్‌ ‌కృషితోనే దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి 8 కాల్వల ద్వారా 66 వేల ఏకరాలకు సాగునీరు, సిద్ధిపేట నియోజకవర్గంలో 4 కాల్వల ద్వారా 35 వేల ఏకరాలకు, గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో 1543 ఏకరాలకు, రాజన్న సిరిసిల్లా జిల్లాలో 5 కాల్వల ద్వారా 21 వేల 976 ఏకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కల అతి త్వరలోనే సాకారం కానున్నదని మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు.

Leave a Reply