Take a fresh look at your lifestyle.

గోనెపల్లిలో గోదారమ్మకు జలహారతి పట్టిన మంత్రి హరీష్‌

  • పొలం వాకిట్లో నీళ్లు రావాలంటే.. పంట కాల్వల భూ సేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
  • గ్రామ యువత బాగా చదవాలని, లేదంటే.. అమ్మబాపుతో కలిసి ఎవుసం చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపు

చిన్నకోడూర్‌ ‌మండలం గోనెపల్లి లోని చెక్‌ ‌డ్యాము కాళేశ్వరం జలాలతో నిండి, మత్తడి దూకడంతో గంగమ్మ తల్లికి జల హారతి పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీశ్‌ ‌రావు, జెడ్పీ చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…పొలం వాకిట్లో నీళ్లు రావాలంటే.. పంట కాల్వల భూ సేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.గ్రామ చెక్‌ ‌డ్యాము నిండి మత్తడి దూకడంతో గోనెపల్లి గ్రామస్తులందరి కళ్లలో సంతోషం. మీ ముఖాల్లో చిరునవ్వు చూసి సంతోషంగా ఉందనీ,సీఏం కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఇంత మంచి పని చేసుకున్నామన్నారు. గోనెపల్లిలో ఇవాళ ఇంత మండు టెండల్లో మే నెలలో చెక్‌ ‌డ్యాము మత్తడి దూకడం మా కలలో కూడా అనుకోలేదని గ్రామస్తులు చెప్పగా.. ఇక నుంచి ఎండి పోవడం కలలో కూడా చూడరని చెబితే.. గ్రామస్తులు సంబురాన్ని వ్యక్తం చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.

గోనెపల్లి చెక్‌ ‌డ్యాములో చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించాలని మత్స్యకారులు కోరిన మేరకు గోనెపల్లిలో మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసి అవకాశం వినియోగించుకోవాలని మత్స్యకారులకు సూచించారు.ఇవాళ సిద్ధిపేట వాగుపై 15వ చెక్‌ ‌డ్యాము నిండిందని., వాటిలో మందపల్లి-07, మిట్టపల్లి-01, రామునిపట్ల-03, ఇబ్రహీంనగర్‌-02, ‌గోనెపల్లి-02 చెక్‌ ‌డ్యాములు నిండి మత్తడి దూకుతున్నాయని మంత్రి వెల్లడించారు.సిద్ధిపేట వాగుపై మొత్తం 28 చెక్‌ ‌డ్యాములు నిండి శనిగరం చెరువుకు నీళ్లు పారుతాయని మంత్రి వివరించారు. గోనెపల్లిలో పంట కాల్వలు తవ్వుకుంటే.. కాల్వల ద్వారా 1567 ఏకరాలకు నీళ్లు పారుతాయి. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ‌మైనర్‌, ‌సబ్‌ ‌మైనర్‌ ‌కెనాల్స్ ‌ద్వారా పొలం వాకిట్లకు నీళ్లు వస్తాయని., పంట కాల్వల నిర్మాణాల భూ సేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.కాలంతో, కరెంటుతో పని లేకుండా యేటా మూడు పంటలు పండించొచ్చు. గోనెపల్లిలో 5 ఏళ్లలో 25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.1.35కోట్లు రూపాయల సీసీ రోడ్లు వేశాం. 15 సబ్‌ ‌స్టేషన్లు తెచ్చామని మంత్రి వివరించారు. గ్రామ యువత బాగా చదవాలని, లేదంటే.. అమ్మబాపుతో కలిసి ఎవుసం చేయాలని మంత్రి హరీశ్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply