కౌన్సిలర్ వేణుతో మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
సిద్దిపేట శివారులో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్… సూడా డైరెక్టర్, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం రంగనాయక్ సాగర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేటీఆర్..సూడా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది.
మొదట కనపడగానే ‘‘వేణు.. నువ్ రైతు వేషంలో ఉన్నావ్ ఇయ్యాల. నువ్ టౌన్ నాయకుడివి కదా.. నువ్వు కూడా రైతువేనా..? అని నవ్వుతూ మంత్రి కేటీఆర్ అనగా… ‘‘నేను పట్టణ రైతునే అన్నా… రంగనాయకసాగర్ మొదటి పార్కం మా భూమిలోనే’’ అని వేణు బదులిచ్చారని సమాచారం. అలాగే, వేణు కారులో ప్రయాణిస్తున్న సందర్భంలోనూ.. ‘‘ఇంత అభివృద్ది చేసినంక కూడా ఇంకా పోటీ చేసి గెలువాల్నా వేణు. యునానిమస్ •చేయాలె కదా హరీష్ బావను…’’ అని మచ్చ వేణుగోపాల్ రెడ్డితో మంత్రి కేటీఆర్ నవ్వుతూ ఛలోక్తులు విసిరినట్లు విశ్వనీయ సమాచారం.