Take a fresh look at your lifestyle.

హరిభూషణ్‌ 21‌న కొరోనాతో మృతి చెందాడు

మావోయిస్ట్ అ‌గ్రనేత మృతిని ధ్రువీకరించిన భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ ‌హరిభూషణ్‌ అలియాస్‌ ‌హెచ్‌బీ అలియాస్‌ ‌లక్మాదాదా ఈనెల 21న కొరోనాతో మృతి చెందాడని భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్‌ ‌ధ్రువీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వొచ్చాయి. దీంతో కొత్తగూడెం జిల్లా పోలీసులు అతడి గురించి సమాచారం సేకరించిన అనంతరం హరిభూషణ్‌ ఈ ‌నెల 21న కొరోనాతో మృతి చెందాడని భదాద్రి ఎస్పీ తెలిపారు. అతను కొరోనాతో గుండెపోటు వొచ్చి ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. మరికొందరు మావోయిస్టులు కూడా కొరోనా బారిన పడ్డారని..పోలీసులను ఆశ్రయిస్తే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. బుధవారం ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌వి•డియా సమావేశం ఏర్పాటు చేసి..హరిభూషణ్‌ ‌మృతికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గత కొంత కాలంగా కొరోనాతో బాధపడుతున్న హరిభూషణ్‌ ‌గుండెపోటుతో మృతి చెందాడని ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌వెల్లడించారు. హరిభూషణ్‌ ‌భార్య శారదతో సహా మరికొంత మంది అగ్రనాయకులు కొరోనా సోకి బాధపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. మహబూబాబాద్‌ ‌జిల్లా కొత్తగూడ మండలం మడగూడకు చెందిన యాప నారాయణ పదో తరగతి వరకు చదువుకొని విప్లవ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యారు. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన నారాయణ దండకారణ్యానికి బదిలీ అయ్యాక అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులై కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ ‌చంద్రన్న మార్గదర్శకత్వంలో బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కొంతకాలం క్రితం హరిభూషణ్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు

Leave a Reply