Take a fresh look at your lifestyle.

కార్పొరేట్‌లకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం

అభ్యర్థులు లేని దయనీయ పరిస్థితిలో ప్రతిపక్షాలు
కార్యకర్తలే మా బలం..పటాన్‌ ‌చెరు మూడు డివిజన్లలో గెలుస్తాం
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేసి సిఎం కెసిఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ధీమా వ్యక్తం చేశారు. పటాన్‌ ‌చెరులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి నివాసంలో బిజెపి లో చేరిన రామచంద్రాపురం సిట్టింగ్‌ ‌కార్పొరేటర్‌ ‌తోంట అంజయ్య యాదవ్‌ ‌తిరిగి మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి అంజయ్య యాదవ్‌ ‌ను మంత్రి హరీష్‌ ‌రావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు విలేఖర్లతో మాట్లాడుతూ..టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో అందరూ సమర్థులైన నాయకులు ఉన్నారని, ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు.
టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో టికెట్‌ ఆశించే ఆశావాహులు ఎక్కువగా ఉంటే, అభ్యర్థులు దొరక్క టిఆర్‌ఎస్‌ ‌నుండి ఎవరైనా వస్తారా అన్న దయనీయ స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. టికెట్‌ ‌దక్కని ఆశావహుల అందరికీ పార్టీ భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి విరుద్ధంగా కార్పొరేటు వ్యవస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రత్యేకంగా శాఖను నెలకొల్పడం దారుణమన్నారు. బిహెచ్‌ఈఎల్‌ ‌సంస్థ మనుగడ సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాళేశ్వరం, యాదాద్రి, థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ఆర్డర్‌ ఇస్తే, ప్రధాని మోడీ బీహెచ్‌ఈఎల్‌ ‌ను పూర్తిగా నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Leave a Reply