Take a fresh look at your lifestyle.

రాష్ట్రాల కాళ్లు, చేతులు కట్టేసిన కేంద్రం

  • రాష్ట్రాలది మద్ధతు ధర కన్నా ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి
  • గజ్వేల్‌లో కేంద్రం లేఖను మీడియాకు విడుదల చేసిన మంత్రి హరీష్‌రావు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. కిషన్‌రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…కేంద్రం జారీ చేసిన లేఖను విడుదల చేశారు. మద్ధతు ధర కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వొద్దనీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసిందిన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రైతులకు మద్ధతు ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి తీసుకువొచ్చిందనీ మండిపడ్డారు.

17 సెప్టెంబర్‌ 2020‌న  ధాన్యం మద్ధతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఇచ్చినా రాష్ట్రం నుంచి బియ్యం, వడ్లు సేకరించేది లేదని స్పష్టం చేస్తూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ పంపిందన్నారు. ఈ లేఖను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునేలా కిషన్‌ ‌రెడ్డి కృషి చేయాలని డిమాండు చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా  గానీ మద్ధతు ధర కంటే ఒక్క రూపాయి అదనంగా ఇస్తే… మేం లేవీగా ఈ వడ్లు  తీసుకునేది లేదని రాష్ట్రాన్ని హెచ్చరిస్తూ కేంద్రం లేఖలో పేర్కొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు.  ఈ లేఖను కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెనక్కు తీసుకునేలా చేయాలని కోరుతున్నానీ, ఈ  లేఖ రాష్ట్రం మెడ మీద కత్తిపెట్టేలా ఉందన్నారు. దీని వల్ల ఒక్క పైసా సన్న వడ్లకు రాష్ట్రాలు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

Leave a Reply