Take a fresh look at your lifestyle.

పేరు పెద్ద ఊరు దిబ్బ

మొదట్లో ధనిక రాష్ట్రమంటివి
రాబడి బాగానే  ఉందంటివి
ఏ ఖర్చకైనా వెనకాడనంటివి
ఇపుడేమో నీళ్ళునములుతుంటివి

కరోనా కాష్ఠ మైమండుతుండే
జనం పిట్టల్లా రాలుతుండే
ఆరోగ్యశ్రీ తో ఆదుకోమంటే
చికిత్సకు సాయపడమంటే
నోరు మెదపక పోతవి
నిత్యచావులను చూడపడితివి

పాలనలో  ‘పస’  లేని తనం!!
కనిపిస్తుంది దాని ‘డొల్ల’తనం!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply