Take a fresh look at your lifestyle.

సంక్రాంతికి స్వాగతం

తెలుగు వెలుగుల పర్వదినం

తెలుగువారి ముంగిట శుభదినం

పాడిపంటల కళకళల పచ్చదనం

రైతు ఇంట ఆశల మూలధనం

వెరసి సంక్రాంతి లక్ష్శికి స్వాగతం

 

అంబరాన్నంటే సంబరాలు

నింగికి ఎగిసే పతంగాలు

కనువిందు చేసే రంగవల్లులు

అబ్బురపరిచే గొబ్బిళ్ళలు

వెరసి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

 

మరదళ్ళ గిల్లికజ్జాలు

బావల అల్లరి వేషాలు

బసవన్న గారడీలు

హరిదాసు భక్తి కీర్తనలు

వెరసి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

 

నోరూరించే పిండి వంటలు

చలిని తరిమే భోగిమంటలు

గంగిరెద్దు గణగణ గంటలు

ముచ్చట గొలిపే కొత్తజంటలు

వెరసి సంక్రాంతి లక్ష్శికి స్వాగతం

 

ఈ మకర సంక్రాంతి

తేవాలి నవ క్రాంతి

నిలపాలి ప్రపంచశాంతి

 

– కయ్యూరు బాలసుబ్రమణ్యం

9441791239

Leave a Reply