Take a fresh look at your lifestyle.

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

చట్ట సభలలో ప్రవేశించాలని ఆకాంక్ష

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌జన్మదినం సందర్భంగా శనివారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీజేఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వెంకటరెడ్డి ప్రొ.కోదండరామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమ ఉత్తమ ఉపాధ్యాయుడు చట్టసభలలోకి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలకు అవినీతి, అణచివేతల నిర్వచనం ఇచ్చిన రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించిన రాజకీయ ప్రజానాయకుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, టీజేఎస్‌ ‌రంగారెడ్డి జిల్లా కమిటీ నాయకులు పల్లె వినయ్‌కుమార్‌, ‌మమత, కొత్త రవి, వెంకట్‌ ‌రెడ్డి, మధుసూధన్‌, ‌ప్రశాంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!