Take a fresh look at your lifestyle.

గణతంత్ర మేలా !

సర్వసత్తాక సార్వభౌమత్వం
సముపార్జించిన శుభ తరుణం

భారత రాజ్యాంగ ప్రవేశికను
ప్రతిష్టించిన చారిత్రక సమయం

పరాయి పాలన అంతం చేసి
స్వరాజ్యం స్థాపించిన సందర్భం

బానిస సంకెళ్లు బద్దలు గొట్టి
స్వేచ్ఛ గాలులు పీల్చిన సుదినం

అహింస మార్గంలో పోరాడి
గెలిచి నిలిచిన స్మరణ నిమిషం

కోట్ల భారతీయుల స్వప్నం
సాకారమైన అమృత క్షణం

అదే భారత గణతంత్ర దినం
ఈ మహాపర్వదినోత్సవాన్ని
భక్తితో ఘనంగా జరుపుదాం

త్రివర్ణ పతాకం నింగిన ఎగరేసి
జనగణమన గీతాలపన చేద్దాం

స్వతంత్ర యోధుల స్తుతిద్దాం
త్యాగదనుల మదిల స్మరిద్దాం
అమరవీరుల ఎదల స్తోత్రిద్దాం
నవభారత నిర్మాతల శ్లాఘిద్దాం

సత్యమే వజేయతే  ..
మేరా భారత్‌ ‌మహాన్‌ అం‌టూ
ముక్త కంఠంతో నినదించుదాం

కదం కదం కలిపి కవాతు చేద్దాం
సమైక్య జీవన పరిమళం పరుద్దాం
సస్యశ్యామల విభవద్గీతం పాడదాం
అగ్ర గణతంత్ర రాజ్యమని చాటుదాం
దేశ కీర్తి ప్రతిష్టలు ఎలుగెత్తి నినదిద్దాం
భరతమాతకు జయ హారతి  పడదాం

  (జనవరి 26 న భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా..)
కోడిగూటి తిరుపతి,9573929493

Leave a Reply