Take a fresh look at your lifestyle.

సంతోషాల సంక్రాంతి

happy sakranthi to all

సంక్రాంతి పండగ తెలుగు ప్రజలు మూడు రోజులపాటు ఆనందంగా జరుపుకునే వేడుక. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులూ తెలుగు వారి ఇండ్లల్లో సంక్రాంతి సంబురాల సంతోషం నెలకొంటుంది. ఇండ్ల వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. యువత పతంగులను ఎగరేస్తారు. హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు ఇలా సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. పంటలన్నీ చేతికొచ్చే రోజులు కాబట్టి రైతుల ఇండ్లు కూడా ధన, ధాన్యాలతో విలసిల్లుతాయి. ఇతర ఆహారాలతో పాటు పాటు చకినాలు, అరిసెలు, పొంగలి వంటి పిండివంటలను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చేసుకుంటారు.

భోగి
సంక్రాంతి మూడు రోజుల పండగలో తొలి రోజు చేసుకునే భోగి పండగది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో పాతకు స్వస్తి చెప్పి.. కొత్తకు ఆహ్వానం పలుకుతూ భోగి రోజున ఉదయాన్నే భోగిమంటలు వేస్తారు. పిడకలు, చెట్లు, తాటాకులతోపాటు.. ఇంట్లోని పాత వస్తువులను కూడా మంటల్లో వేస్తారు. కాలంతో వొచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండగ అని పెద్దలు చెబుతారు. భోగి పండుగకు రేగుపళ్ళు, బియ్యం, ఇతర వస్తువులు కలిపి చిన్నారులకు తలపై బొడ బొడ పళ్లు లేదా భోగి పళ్లు పోయడం పోయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే.. శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయన్నది ప్రజల విశ్వాసం. పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపొతుందని కూడా నమ్ముతారు. పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని కూడా విశ్వసిస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. సంక్రాంతిని సూర్యుడి పండగగా భావిస్తారు కాబట్టే.. సూర్యడి ఆశీస్సుల కోసం భోగిపళ్ళు పోస్తారు. పన్నెండేళ్ళ లోపు పిల్లలందరికీ తలపై భోగి పండ్లను పోస్తుంటారు. ఇదీ భోగీ పండుగ ప్రాశస్త్యం.

సంక్రాంతి
సూర్యుడు మకర రాసి లేదా మకర(భారతీయ రాసి) లోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అంటారు. ‘సంక్రాంతి’ అనే పదానికి అర్థం సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశి లోకి ప్రవేశించడానికి సూచనగా చెప్తారు. కాబట్టి ఈ పేరు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల వొచ్చింది. మకర సంక్రాంతి పురాతన కాలం నాటి పండుగలలో ఒకటి, ఇది కాంతిపాతం పడిపోవడం వల్ల, ఆరోజు పగలు రాత్రి రెండూ అంతే ఎక్కువగా ఉంటాయి. పండుగ తరువాత, వసంత కాలం అధికారికంగా వొస్తుంది లేదా భారతీయ వేసవి ప్రారంభమవుతుంది, పగలు సమయం ఎక్కువ ఉండి, రాత్రి సమయం తక్కువ ఉంటుంది. మకర సంక్రాంతి ప్రసిద్ది చెందిన పండుగ అయినప్పటికీ, ఇది ప్రధానంగా వ్యవసాయ పండుగ, దీన్ని తూర్పు నుండి పశ్చిమం, ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశం మొత్తం జరుపుకుంటారు. దక్షిణం కింద, పశ్చిమ భారతంలో మకర సంక్రాంతిగా అత్యంత ప్రసిద్ది చెందితే, ఉత్తర భారత దేశంలో ఈ పండుగను పొంగల్‌ అని పిలుస్తారు, దీన్ని లోహ్రీగా జరుపుకుంటారు. ఉత్తరాయన్‌, ‌మాఘి, ఖిచ్డి, మరి కొన్ని ఇతర పేర్లు ఈ పండుగకు ఉన్నాయి.
స్రతి మూడు రోజులలోనూ వాకిళ్లలో ముగ్గులు వేసినప్పటికీ ప్రత్యేకంగా సంక్రాంతి నాడు వివిధ కళారూపాలలో అలంకరిస్తారు. ఈ సందర్భంగా ఆడవాళ్లకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ముగ్గులలో దివ్యత్వం ఉట్టిపడుతూ కళానైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఇంటి వాకిట్లో ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ రకరకాలుగా ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. ఈ రోజున ముఖ్యంగా స్త్రీలు వివిధ రకాలైన వస్తువులతో సంక్రాంతి నోములు నోచుకుంటారు. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంత్రికి ప్రాధాన్యముంది. సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తి ఉంది.

కనుమ
కనుమ రోజున ఆడవాళ్లు ఒకరి ఇంటికి ఒకరు పేరంటానికి వెళ్లి నోచిన నోములు ‘ఇస్తినమ్మా వాయనం..పుచ్చుకుంటినమ్మా వాయనం’ అంటూ ఒకరికొకరు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాకుండా ఒకరికొకరు నువ్వులు, చక్కెర కలిపి ఇచ్చు పుచ్చుకుంటూ ‘నువ్వులు తిని నూరేళ్లు బతుకు..తీపి తిని తియ్యగా మాట్లాడు’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆంధ్రా రాయల సీమ ప్రాంతాల్లో రైతులు కనుమను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి, పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటికి ప్రత్యేక మైన దానాను అందచేస్తారు. గోపూజ నిర్వహిస్తారు. పంట చేల వద్ద కొంత మంది రైతులు రేగాకు , ఎముక, జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వొస్తున్న ఆచారం.

Leave a Reply