రైతు వరి వేస్తె ఉరేనట
ఇది కేంద్ర సర్కార్ మాటంట
అదే… సీఎం నోటి వెంట
అయ్యె ఇదెక్కడి విపరీతం
ధాన్యం సాగే కదా అపరిమితం
కాళేశ్వరం కట్టిందెందుకు
కాల్వలు తవ్విందెందుకు
చెరువులు నింపిందెందుకు
కోట్లాది ఖర్చు నీళ్ళ పాలేనా
పొలాలు పడావు పెట్టాల్నా
అన్నదాత అగం కావాల్నా
‘‘జలాల కోసం కొట్లాడిందెందుకు
తెలంగాణ రాష్ట్ర సాధించిందెందుకు’’!?
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర